‘ఖేలో ఇండియా’ సెంటర్‌గా కడప వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌

భవిష్యత్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌లను తయారు చేయడమే  ధ్యేయంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ‘ఖేలో ఇండియా’ పథకానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందేే.

‘ఖేలో ఇండియా’ సెంటర్‌గా కడప వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌
Follow us

|

Updated on: Oct 18, 2020 | 4:31 PM

భవిష్యత్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌లను తయారు చేయడమే  ధ్యేయంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ‘ఖేలో ఇండియా’ పథకానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందేే. ఈ  స్కీమ్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని‌ కడప జిల్లా చోటు దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘ఖేలో ఇండియా స్టేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (కేఐఎస్‌సీఈ)’ సెంటర్లను డెవలప్ చేయనున్నట్లు కేంద్ర క్రీడా శాఖ శనివారం అనౌన్స్ చేసింది. ఇందులో కడప‌ జిల్లాలోని ‘డా. వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌’ ఎంపికైంది. ఈ పథకంలో ప్లేస్ దక్కడంతో వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో హై పెర్ఫార్మెన్స్‌ అధికారులు, కోచ్‌లు, మౌలిక వసతులు, అధునాతన  టెక్నాలజీతో పాటు ఇతరత్రా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో 14 సెంటర్లను కేఐఎస్‌సీఈగా మారుస్తున్నట్లు క్రీడా శాఖ అనౌన్స్ చేయగా… తాజా జాబితాతో వాటి సంఖ్య 23కు చేరింది. తాజాగా ఈ లిస్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, చంఢీగఢ్, గోవా, హరియాణా, పుదుచ్చేరి, హిమాచల్‌ ప్రదేశ్, త్రిపుర, జమ్మూ కశ్మీర్‌లు చేరాయి.

Also Read :  Bigg Boss Telugu 4 : అనుకున్నదే జరిగింది, కుమార్ సాయిని పంపించేశారు !