Sankranti: ఆంధ్రాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు.. కడప జిల్లాలో వినూత్నంగా విధులకు హాజరైన పోలీసులు..

Sankranti: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి తలస్నానాలు ఆచరించి..

  • Shiva Prajapati
  • Publish Date - 2:57 pm, Thu, 14 January 21
Police Dress up Traditional

Sankranti: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి తలస్నానాలు ఆచరించి కొత్త బట్టలు ధరించి సంక్రాంతిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటి ముంగిట రంగు రంగుల రంగవళ్లులు, హరిదాసుల సంకీర్తనలు, బసన్నల సన్నాయిరాగంతో పల్లె సీమలు పండుగ శోభను సంతరించుకున్నాయి. మరోవైపు కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు జోరందుకున్నాయి.

ఇదిలాఉంటే.. ఏపీలోని కడప జిల్లాలో పోలీసులు సంక్రాంతి పండుగను వినూత్నంగా జరుపుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ పిలుపుతో సరికొత్తగా సంక్రాంతి సంబరాలను పోలీసులు అధికారులు నిర్వహిస్తున్నారు. కడప సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు సంప్రదాయ దుస్తులై పంచకట్టు వస్త్రాలను ధరించి సందడి చేశారు. ఇలా నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులు.. తొలిసారి విధుల్లో భాగంగా సంప్రదాయ దుస్తులు ధరించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఊర్లో ఉండి పండుగ చేసుకునంత ఆనందంగా ఉందని పోలీసులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Also read:

నాలుగు డ్రోన్‌ కెమెరాలతో ఆపరేషన్ టైగర్ ఫైనల్ ఫైట్, పులికోసం కందిభీమన్న అటవీ ప్రాంతంలో ఎడతెగని ఉత్కంఠ

ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోనే ట్రాక్టర్ ర్యాలీ, రెడ్ ఫోర్ట్ వద్ద కాదని రైతు సంఘాల ప్రకటన, 26 న పరేడ్ కి అడ్డురాబోమని స్పష్టీకరణ