Breaking News
  • ఏపీ అసెంబ్లీలో మహిళల భద్రతపై స్వల్పకాలిక చర్చ. మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు-హోంమంత్రి సుచరిత. మహిళల రక్షణ, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. మహిళామిత్ర విభాగం ఏర్పాటు చేశాం. మహిళా కానిస్టుబుళ్లను నియమించాం. ఆత్మహత్యలు, ఒత్తిడి నిర్వహణ అంశాలపై కౌన్సెలింగ్‌. బాల్య వివాహాల నియంత్రణకు అవగాహన కల్పిస్తున్నాం-సుచరిత.
  • ప్రతి రైతుబజార్‌లో ఉల్లిని ప్రభుత్వం విక్రయిస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాం. 36,536 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నాం. మేం రూ.25కే కిలో ఉల్లి ఇస్తే హెరిటేజ్‌లో రూ.200కు అమ్ముతున్నారు.
  • మహిళల భద్రతపై చర్చిస్తుంటే టీడీపీ అడ్డుకుంటోంది. ఉల్లిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది-మంత్రి బుగ్గన. మహిళల పట్ల ప్రతిపక్షానికి బాధ్యతలేదు-మంత్రి బుగ్గన.
  • టీడీపీ ఎమ్మెల్యేలకు మహిళల భద్రత అవసరం లేదా-ఎమ్మెల్యే రజని. మహిళలు అభద్రతాభావంతో ఉన్నారు. మహిళల భద్రతపై మాట్లాడుతుంటే అడ్డుకుంటారా. మహిళల రక్షణపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు-ఎమ్మెల్యే రజని. మహిళలపై టీడీపీ నేతల నేరాలు బయటపడతాయనే చర్చను అడ్డుకుంటున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయి-ఎమ్మెల్యే రజని.
  • టీడీపీ సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని ఆగ్రహం. ఉల్లి ధరలపై సీఎం చర్చిస్తామన్నారు. మహిళల భద్రతపై చర్చను అడ్డుకోవడం తగదు. చర్చకు సహకరించాలని కోరిన స్పీకర్‌ తమ్మినేని.
  • దిశ ఘటనతో మహిళలందరూ తల్లడిల్లిపోయారు-రోజా. సీఎం జగన్‌పై మహిళలందరికీ నమ్మకం ఉంది. మహిళలందరూ తమ గోడును జగన్‌కు చెప్పాలనుకుంటున్నారు. ఒక మహిళను హోంమంత్రి చేసిన ఘనత జగన్‌ది. హోంమంత్రి మాట్లాడుతుంటే టీడీపీ అడ్డుకుంటోంది. కాల్‌మనీ, లోకేష్‌ ఫొటోలు, బాలకృష్ణ వ్యాఖ్యలపై.. చర్చ జరుగుతుందేమోనని టీడీపీ అడ్డుకుంటోంది. మహిళలంటేనే టీడీపీ నేతలకు చులకన భావం. మహిళల భద్రతపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు-రోజా. దిశ ఘటన తర్వాత మహిళలు భయపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయి-రోజా. ఆంధ్రప్రదేశ్‌ అంటే ఆడవాళ్లప్రదేశ్‌గా మారాలి-రోజా. రేప్‌ చేసి చంపినప్పుడు గుర్తురాని మానవ హక్కులు.. ఎన్‌కౌంటర్‌ చేస్తే ఎందుకు గుర్తుకువస్తున్నాయి. దిశ కుటుంబసభ్యులను హెచ్‌ఆర్సీ ఎందుకు పరామర్శించలేదు-రోజా.
  • ఏపీ శాసనమండలిలో ఉల్లి ధరపై టీడీపీ వాయిదా తీర్మానం. మాతృభాషపై బీజేపీ వాయిదా తీర్మానం. వాయిదా తీర్మానాలను తిరస్కరించిన చైర్మన్‌. మండలిలో టీడీపీ సభ్యుల నిరసన.

నెల్లూరు కోర్టు సంచలన తీర్పు..కామాంధుడు జీవితాంతం జైలులోనే

Lifer For Raping Minor, నెల్లూరు కోర్టు సంచలన తీర్పు..కామాంధుడు జీవితాంతం జైలులోనే

నెల్లూరు ఒకటో అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లాకు చెందిన 11 ఏళ్ల బాలిక సెలవుల్లో తన అమ్మమ్మ వాళ్ల ఇంట్లో కొన్ని రోజులు ఉండేందుకు వచ్చింది. ఆమె తనకు ఇషమైన వాటిని కొనుక్కునేందుకు ప్రతి రోజు దగ్గర్లో ఉన్న కిరాణ షాపుకు రావడాన్ని గమనించాడు ముత్తుకూరు ఎమ్మార్వో కాలనీకి చెందిన సాయికృష్ణ. చాకెట్లు, బిస్కెట్లు కొనిపించి మచ్చిక చేసుకుని సదరు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా చాలాసార్లు తన ఆటవిక బుద్దిని ప్రదర్శించాడు. ఒకరోజు బాలిక ఇంట్లో సాయికృష్ణ ఆగడాల గురించి చెప్పింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. బాలిక కోర్టులో లైంగిక దాడి జరిగినట్టు వాంగ్మూలం ఇవ్వడంతో అతడిని కోర్టు దోషిగా తేల్చింది.

2015లో నమోదైన ఈ కేసుపై నెల్లూరు ఒకటో అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ కోర్టు నిందితుడు సాయికృష్ణను చనిపోయేంతవరకు జైలులోనే ఉంచాలని సంచలన తీర్పు వెలువరించారు. జైలు శిక్షతో పాటు రూ.2లక్షల జరిమానా సైతం విధించారు.