వైసీపీపై ఈసీకి ఫిర్యాదు చేసిన కేఏ పాల్

వైసీపీపై ఎన్నికల కమిషన్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం ఏపీ సీఈవో ద్వివేదిని కలిసిన పాల్ తన పార్టీ కండువాను వైసీపీ కాపీ కొట్టిందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 2008లో తమ పార్టీని రిజిస్టర్ చేయించామని, కానీ 2011లో తమ జెండాను జగన్ మోహన్ రెడ్డి కాపీ కొట్టారని ఆయన ఆరోపించారు. అలాగే ఓటు బ్యాంకును చీల్చాలని తమ అభ్యర్థుల పేర్లతో సరిపోలిన అభ్యర్థులను వైసీపీ పోటికి […]

వైసీపీపై ఈసీకి ఫిర్యాదు చేసిన కేఏ పాల్
Follow us

| Edited By: Vijay K

Updated on: Mar 28, 2019 | 6:57 PM

వైసీపీపై ఎన్నికల కమిషన్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం ఏపీ సీఈవో ద్వివేదిని కలిసిన పాల్ తన పార్టీ కండువాను వైసీపీ కాపీ కొట్టిందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 2008లో తమ పార్టీని రిజిస్టర్ చేయించామని, కానీ 2011లో తమ జెండాను జగన్ మోహన్ రెడ్డి కాపీ కొట్టారని ఆయన ఆరోపించారు. అలాగే ఓటు బ్యాంకును చీల్చాలని తమ అభ్యర్థుల పేర్లతో సరిపోలిన అభ్యర్థులను వైసీపీ పోటికి నిలబెట్టిందని పాల్ అన్నారు. ఈ నెల 24న తమ పార్టీ బి-ఫామ్‌లు, స్టాంపులను వైసీపీ దొంగలించిందని ఆయన ఆరోపించారు. తనను అడుగడునా వైసీపీ అడ్డుకుంటోందని.. నర్సాపురంలో తాను నామినేషన్ వేసే సమయంలో జగన్ అనుచరులు తనను ఇబ్బంది పెట్టారని ఆయన ఆరోపణలు చేశారు.

ఇక తమ పార్టీకి ఇచ్చిన హెలికాఫ్టర్ గుర్తు, వైసీపీ ఫ్యాన్ గుర్తు ఒకేలా ఉన్నాయని.. దీనిపై ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వకముందే ఎన్నికల కమిషన్‌ను తాము ఫిర్యాదు చేశామని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు విడతల వారిగా జరుగుతున్నాయని, కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒకే విడతలో ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికలను వాయిదా వేయాలని తాను ఎన్నికల ప్రతినిధిని కోరినట్లు కేఏ పాల్ చెప్పారు. అయితే ఈ విషయం తమ పరిధిలోనిది కాదని, ఢిల్లీలో అడగాలని రాష్ట్ర అధికారి తనకు చెప్పినట్లు పాల్ పేర్కొన్నారు.