కామెడీ ఎంటర్టైనర్లో జ్యోతిక
సెకండ్ ఇన్నింగ్స్లో విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న నటి జ్యోతిక మరో లేడీ సెంట్రిక్ మూవీలో నటించనుంది. ‘గులేబకావలి’ ఫేమ్ కల్యాణ్ దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్టైనర్కు జ్యోతిక ఓకే చెప్పింది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరగగా.. ముఖ్య అతిథిగా హాజరైన సూర్య తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఇక ఇదే చిత్రంలో సీనియర్ నటి రేవతి కీలక పాత్రలో కనిపించనుంది. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య […]
సెకండ్ ఇన్నింగ్స్లో విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న నటి జ్యోతిక మరో లేడీ సెంట్రిక్ మూవీలో నటించనుంది. ‘గులేబకావలి’ ఫేమ్ కల్యాణ్ దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్టైనర్కు జ్యోతిక ఓకే చెప్పింది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరగగా.. ముఖ్య అతిథిగా హాజరైన సూర్య తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఇక ఇదే చిత్రంలో సీనియర్ నటి రేవతి కీలక పాత్రలో కనిపించనుంది. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో యోగి బాబు, ఆనంద్ రాజ్, మన్సూర్ అలీ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు.