బనానాస్ ఓవర్ కాస్ట్..యాక్టర్ వైరల్ ఫోస్ట్..జీఎస్టీ ఆఫీసర్స్ ఫైన్‌తో సెట్‌రైట్!

JW Marriott Chandigarh slapped with Rs 25k fine after Rahul Bose's viral video on banana bill, బనానాస్ ఓవర్ కాస్ట్..యాక్టర్ వైరల్ ఫోస్ట్..జీఎస్టీ ఆఫీసర్స్ ఫైన్‌తో సెట్‌రైట్!

ఛండీగఢ్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రాహుల్‌బోస్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన అరటిపండ్ల అధికధర వివాదంలో హోటల్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండు అరటి పళ్లకు రూ.442 వసూలు చేసిన జేడబ్ల్యూ మారియట్ హోటల్‌పై ఎక్సైజ్- పన్నుల శాఖ రూ.25వేల జరిమానా విధించింది.  సీజీఎస్టీలోని సెక్షన్‌ 11 నిబంధనలను అతిక్రమించి పండ్లను అధిక ధరకు విక్రయించినందుకు గానూ ఆ హోటల్‌కు రూ.25వేలు జరిమానా విధించారు.

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రాహుల్‌బోస్‌ జులై 22న షూటింగ్‌లో భాగంగా ఛండీగఢ్‌ వెళ్లారు. అక్కడ ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌ బస చేసిన ఆయన రెండు అరటిపండ్లు తీసుకురమ్మని హోటల్‌ సిబ్బందికి చెప్పారు. పండ్లు తీసుకువచ్చిన సిబ్బంది అతడికి రెండు పండ్లపై రూ.442.50 బిల్లు వేసి ఇచ్చారు. దీంతో కంగుతిన్న నటుడు అరటిపండ్లు ఆరోగ్యానికి హానికరం అంటూ వ్యంగ్యంగా వీడియో తీసి పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అయింది. దీనిపై ఛండీగఢ్‌ ఎక్సైజ్‌, పన్నుల శాఖ కమిషనర్‌ దృష్టి సారించి విచారణకు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *