‘జస్టిన్ ట్రూడో.. మీ రియల్ ఫేస్ చూడండి !’

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం  ఒట్టావాలో రేసిజానికి (జాత్యహంకారానికి) వ్యతిరేకంగా ఆందోళనకారులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. వారికి సంఘీభావం ప్రకటిస్తూ మోకాళ్ళపై కూర్చుని..

'జస్టిన్ ట్రూడో.. మీ రియల్ ఫేస్ చూడండి !'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 06, 2020 | 11:56 AM

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం  ఒట్టావాలో రేసిజానికి (జాత్యహంకారానికి) వ్యతిరేకంగా ఆందోళనకారులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. వారికి సంఘీభావం ప్రకటిస్తూ మోకాళ్ళపై కూర్చుని మీకు నా సపోర్ట్ ఇదే అంటూ ఫోటోలకు పోజులిచ్చారు. పోలీసుల నిరంకుశత్వాన్ని, నల్ల జాతీయుల పట్ల వారి ద్వేష భావాన్ని ఖండిస్తూ.. అనేకమంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కొందరు తమకు మద్దతునిచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయగా.. మరికొంతమంది  సోషల్ మీడియా యూజర్లు మాత్రం ఆయన గత ఏడాది చూపిన ‘ నిజరూపాన్ని’ గుర్తు చేస్తూ ఆ ఫోటోలను ట్వీట్ చేశారు. ముఖానికి నల్లరంగు పూసుకుని యువతులతో ఆయన దిగిన ఫోటోను వారు పోస్ట్ చేశారు. ఇక శుక్రవారం నాటి నిరసనకారుల్లోనూ కొంతమంది.. ఆయనను ఉద్దేశించి ‘ గో హోమ్ బ్లాక్ ఫేస్’ అని కేక పెట్టగా.. ఇంకొందరు ‘ ఇది జస్ట్ అనెదర్ ఫోటో పోజు’ అని పేర్కొన్నారు.

అమెరికాలో నల్లజాతీయులు పట్ల అధ్యక్షుడు ట్రంప్ పాటిస్తున్న విధానంపై ఇటీవల మీడియా జస్టిన్ ట్రూడో ను ప్రశ్నించగా సుమారు 30 సెకండ్ల పటు ఆయన ఏమీ చెప్పలేక… మాట రాక.. కళ్లప్పగించి చూస్తుండిపోయారు. ఈ వీడియో కూడా వైరల్ అయింది. 48 ఏళ్ళ ట్రూడో అసలు నల్ల జాతీయులకు మద్దతు నిస్తున్నారా లేక ట్రంప్ ‘భజన’ చేస్తున్నారా అన్నది తెలియకుండా ఉంది.

Vieo Courtesy: MailOnline