దేశంలోనే తొలిసారి..ఏపీ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం

AP High Court judge to head panel for scrutinising government tenders, దేశంలోనే తొలిసారి..ఏపీ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రూ.100 కోట్లు దాటిన ప్రాజెక్టులన్నీ ఇకపై న్యాయసమీక్ష తర్వాతే ముందుకు వెళ్లనున్నాయి. దీని కోసం హైకోర్టు జడ్జి జస్టిస్ బి.శివ శంకర్ రావు నియమితులైనట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు ప్ర‌ధాన న్యామ‌మూర్తి సిఫార్సు మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. జస్టిస్ శిశంకర్‌ రావు మూడేళ్ల పాటు ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. రూ.100 కోట్లు పైగా ప‌నుల టెండ‌ర్లను జ్యుడిషియ‌ల్ న్యాయ సమీక్ష చేస్తారు. రివ్యూల అనంతరమే ప్రాజెక్టుల కాంట్రాక్టులను ప్రభుత్వం ఓకే చేస్తుంది.  గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లోనే జ్యుడిషియ‌ల్ ప్రివ్యూ ప్ర‌క్రియకు సంబంధించి చ‌ట్టం చేశారు.

దేశంలో మొట్టమొదటిసారిగా.. ప్రభుత్వ టెండర్లలో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం ఈ కొత్త విధనానికి నాంది పలికింది.  గత టీడీపీ హయాంలో ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులను తమ వాళ్లకు కట్టబెట్టారని  జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే తాము జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి పారదర్శకంగా టెండర్లను నిర్వహిస్తామన్నారు. మాట చెప్పినట్టుగానే మూడు నెలలలోపు న్యాయసమీక్షను అమలులోకి తెస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ప్రివ్యూ ప్రాసెస్ ప్రకారం ఇకపై ఏదైనా టెండర్ రూ.100 కోట్లు దాటితే.. జడ్జి టెండర్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రజలు, నిపుణుల పరిశీలనకు వారం రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచుతారు. అలాగే సాంకేతిక విభాగం నుంచి సలహాలు, సూచనలు, వివరాలు తీసుకోవచ్చు. టెండర్ల విషయంలో జడ్జి చేసే సిఫార్సులను సంబంధిత శాఖ కచ్చితంగా పాటించాలి. జడ్జి 8 రోజులు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత.. పలు సూచనలు, సలహాలు ఇస్తారు. మొత్తం ఈ విధానంలో 15 రోజుల్లో టెండర్‌ ప్రతిపాదనను ఖాయం చేస్తారు. ఆ తర్వాతే బిడ్డింగ్‌ పారదర్శకంగా కాంట్రాక్టర్లకు దక్కుతుంది. ఈ విధానం కనక విజయవంతమైతే దేశంలో చాలా రాష్ట్రాలకు జగన్ సర్కార్ ఆదర్శం కానుంది. ఏది ఏమైనా తన మార్కు పాలనతో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ మరోసారి ఆ పంథాను చాటుకున్నారు.

AP High Court judge to head panel for scrutinising government tenders, దేశంలోనే తొలిసారి..ఏపీ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *