Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

‘ నాయనా ! విరాటూ ! చలాన్ కట్టి ఇలా అయిపోయావా ? ‘

Just Paid Traffic Challan, ‘ నాయనా ! విరాటూ ! చలాన్ కట్టి ఇలా అయిపోయావా ? ‘

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎందుకో ఒక్కసారిగా వైరాగ్యంలోకి దిగిపోయినట్టున్నాడు. ‘ మనల్ని మనం అంతర్లీనంగా చూసుకుంటున్నంత వరకు-బయట దేన్నీ చూడాల్సిన అవసరం ఉండదు ‘ అనే క్యాప్షన్ తో.. షర్ట్ లేకుండా కూచుండిపోయినట్టున్న తన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అంతే ! ‘ గూజ్ బంప్స్ ‘ తో కొందరు ఫ్యాన్స్ , హిలేరియస్ (తమాషా) కామెంట్లు, ఫొటోలతో మరికొందరు ‘ చెలరేగిపోయారు ‘. బహుశా ట్రాఫిక్ ఉల్లంఘనకు ఈయన పెద్ద మొత్తంలో చలాన్ చెల్లించి ఇలా దిగాలుగా కూర్చుని ఉన్నట్టున్నాడు ‘ అని కొందరుసెటైర్ వేశారు. ఈ నెల 3 న గురుగ్రామ్ లో హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు, ఆర్ సి బుక్ లేనందుకు ఒక వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు 23 వేల రూపాయల చలాన్ విధించారు. దీంతో సోషల్ మీడియాలో ‘ మేమ్ ‘ లు వెల్లువెత్తాయి. కోహ్లీ అభిమానులు ఈ ఫోటోను, చలానా జరిమానాను ముడిపెడుతూ చెండాడేశారు. ఇంకా ఇలాంటివే బోలెడు ఫోటోలు కూడా ప్రత్యక్షమయ్యాయి.
(టెస్ట్ క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఇండియన్ కెప్టెన్ గా రికార్డులకెక్కాడు కోహ్లీ. అలాగే ఇటీవల ‘ కరేబియన్ టూర్ ‘ లో నెలరోజుల పాటు సాగిన ‘ పోరాటం ‘ లో వెస్టిండీస్ పై మూడు ఫార్మాట్లలో టీమిండియా గెలిచిందంటే అది కోహ్లీ చలవే మరి !)

 

 

Related Tags