సైలెంట్‌గా ఉంటే మాట్లాడతా.. లేదంటే వెళ్ళిపోతాః ఎన్టీఆర్

సాధారణంగా సినిమా ఫంక్షన్లలో గానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో గానీ ఫ్యాన్స్ హడావుడి చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అది హీరోలకు విసుగు కూడా తెప్పిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు అదే పరిస్థితి ‘ఎంత మంచివాడవురా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు ఎదుర్కొన్నారు. చక్కగా నాలుగు మంచి మాటలు చెప్పాలని వారు చూస్తే.. అభిమానులు మాత్రం మధ్యలోనే అడ్డుతగిలి వారి స్పీచ్‌ను ముగింపు జేశారు. ఇక ‘ఎంత మంచివాడవురా’ సినిమా ప్రీ రిలీజ్ […]

సైలెంట్‌గా ఉంటే మాట్లాడతా.. లేదంటే వెళ్ళిపోతాః ఎన్టీఆర్
Follow us

| Edited By:

Updated on: Jan 09, 2020 | 8:14 AM

సాధారణంగా సినిమా ఫంక్షన్లలో గానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో గానీ ఫ్యాన్స్ హడావుడి చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అది హీరోలకు విసుగు కూడా తెప్పిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు అదే పరిస్థితి ‘ఎంత మంచివాడవురా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు ఎదుర్కొన్నారు. చక్కగా నాలుగు మంచి మాటలు చెప్పాలని వారు చూస్తే.. అభిమానులు మాత్రం మధ్యలోనే అడ్డుతగిలి వారి స్పీచ్‌ను ముగింపు జేశారు.

ఇక ‘ఎంత మంచివాడవురా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఆయన చిత్ర యూనిట్‌ను శుభాకాంక్షలు తెలపడమే కాకుండా.. సంక్రాంతికి విడుదలయ్యే మిగతా సినిమాలు కూడా విజయవంతం కావాలని కోరుకున్నారు. అయితే స్పీచ్ మాట్లాడాలని అనుకున్న ఎన్టీఆర్‌కు మొదట్లోనే అభిమానులు అడ్డుతగిలారు. ‘మీరు సైలెంట్‌గా ఉంటారా.. లేకపోతే వెళ్ళిపోతాను’ అని హెచ్చరించారు. దానితో కొంతసేపు ఫ్యాన్స్ కంట్రోల్ అయ్యారు

‘ఈ ఈవెంట్‌లో తాను కూడా ఓ భాగమైనందుకు ‘ఎంత మంచివాడవురా’ యూనిట్ సభ్యులందరికీ. అభిమానులకు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కళ్యాణ్ రామ్ అన్న ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశారని.. కానీ ఎప్పుడూ కూడా మంచి కుటుంబసమేత చిత్రం చేయలేదనే వెలితి ఉండేదని ఎన్టీఆర్ అన్నారు. ఇప్పుడు అది కూడా దర్శకుడు సతీష్ వేగ్నేశ గారితో నిజమవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, ఆదిత్య సంస్థల కలయికలో ఈ సినిమా జనవరి 15న వస్తోందన్న ఆయన.. దీన్ని తప్పకుండా ఆదరించారని ప్రేక్షకులను కోరారు. కాగా, ఇంటివరకు జాగ్రత్తగా వెళ్లాలని ఫాన్స్ అందరికి ఆయన విజ్ఞప్తి చేశారు.

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.