విషం కలిపిన చపాతీ పిండితో జడ్జిని చంపిన మహిళ

మధ్యప్రదేశ్‌లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన న్యాయమూర్తి, అతడి కుమారుడు కేసును పోలీసులు ఛేదించారు. జడ్జి కుటుంబాన్ని చపాతీ పిండిలో విషం కలిపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళతో సహా ఓ మాంత్రికుడు మరో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

విషం కలిపిన చపాతీ పిండితో జడ్జిని చంపిన మహిళ
Follow us

|

Updated on: Jul 31, 2020 | 12:28 AM

మధ్యప్రదేశ్‌లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన న్యాయమూర్తి, అతడి కుమారుడు కేసును పోలీసులు ఛేదించారు. జడ్జి కుటుంబాన్ని చపాతీ పిండిలో విషం కలిపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళతో సహా ఓ మాంత్రికుడు మరో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

మధ్యప్రదేశ్‌లో గతవారం న్యాయమూర్తి మహేంద్ర త్రిపాఠీ ఆయన కుమారుడు విషపూరిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. అస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే, విషపూరితమైన చపాతీలు తినడం వల్లే జడ్జి బేతుల్ మహేంద్ర త్రిపాఠీ, ఆయన కుమారుడు అభియన్ రాజ్ (33) చనిపోయారని పోలీసులు తెలిపారు. ఈ చింద్వారా జిల్లాలో స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు సంధ్యా సింగ్ (45) విషం కలిపిన గోధుమ పిండిని న్యాయమూర్తి కుటుంబానికి ఇచ్చిందని పోలీసులు ఆరోపించారు.

జులై 20న న్యాయమూర్తి మహేంద్ర త్రిపాఠీ ఆ గోధుమ పిండిని తీసుకురాగా.. ఆయన భార్య అదే రోజు చపాతీలు చేసింది. ఈ చపాతీలు తిన్న మహేంద్ర త్రిపాఠీతో పాటు అయన ఇద్దరు కుమారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ముగ్గుర్నీ వైద్యం కోసం స్థానిక హాస్పిటల్‌కు తరలించగా.. జడ్జి, అభియన్ రాజ్ పరిస్థితి విషమించింది. దీంతో జులై 25న మెరుగైన వైద్యం కోసం వారిని నాగ్‌పూర్‌కి తరలిస్తుండగా.. అభియన్ మార్గమధ్యలోనే చనిపోయాడు. ఆ తర్వాత రోజు మహేంద్ర త్రిపాఠీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. సంధ్యా సింగ్ ఇచ్చిన గోధుమ పిండితో చేసిన చపాతీలను జడ్జి, అతడి కుమారులు తిన్నారని, భార్య మాత్రం ఆ రోజు రైస్ తినడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పిందని ఛింధ్వారా ఎస్పీ సిమ్లా ప్రసాద్ తెలిపారు. త్రిపాఠీ చిన్న కుమారుడు ఆశిష్ కూడా చపాతీలు తిన్నా.. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

నాగ్‌పూర్ వెళ్లినప్పుడు తన తండ్రికి సంధ్యా సింగ్ ఈ గోధుమ పిండి ఇచ్చినట్టు ఆశిష్ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఈ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. న్యాయమూర్తి కుటుంబాన్ని అంతంచేయాలని సంధ్యా సింగ్ పథకం ప్రకారమే విషం కలిపిన గోధుమ పిండి ఇచ్చిందని ఎస్పీ సిమ్లా ప్రసాద్ అన్నారు.

మహేంద్ర త్రిపాఠీ ఛింద్వారా జిల్లా న్యాయమూర్తిగా వచ్చిన తర్వాత సంధ్యా సింగ్‌తో పరిచయం ఏర్పడిందని, తర్వాత స్నేహంగా మారిందన్నారు. లాక్‌డౌన్ కారణంగా గత నాలుగు నెలల నుంచి త్రిపాఠీని కలవని సంధ్యా సింగ్.. ఆయన కుటుంబంతో కలిసి బేతుల్‌లో ఉంటున్నట్టు తెలుసుకుని, తీవ్ర ఆక్రోశంతో రగిలిపోయింది. దీంతో ఆయన కుటుంబాన్ని అంతం చేయాలని కుట్ర పన్నిందని ఎస్పీ వివరించారు. తాను మీ కోసం పూజచేశానని, మంత్రించిన ఈ గోధుమ పిండితో చేసిన చపాతీలు తింటే అన్ని సమస్యలు తీరిపోతాయని నమ్మబలికి విషం కలిపి ఇచ్చిందని ఎస్పీ వివరించారు. సంధ్యా సింగ్‌తో పాటు ఆమెకు సహకరించిన ఓ మాంత్రికుడు మరో నలుగురిని అరెస్ట్ చేశామని, వారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్పీ సిమ్లా ప్రసాద్ వెల్లడించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!