Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

జగన్‌తో జానీయర్ ఎన్టీఆర్ మామ భేటి

, జగన్‌తో జానీయర్ ఎన్టీఆర్ మామ భేటి

హైదరాబాద్: ఎలక్షన్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో వలసలు ఊపందుకున్నాయి. వైసీపీలోకి ఇద్దరు టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్ర బాబు… ఇద్దరు ఎమ్మెల్యేలు ఆమంచి, మేడా మల్లిఖార్జున చేరడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఎందుకు కలిశారని మీడియా ఆయనను ప్రశ్నించగా.. జగన్‌ను మర్యాద పూర్వకంగానే కలిశానని నార్నె శ్రీనివాసరావు బదులిచ్చారు. వీరితో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేతో వైసీపీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తనకు, తన కుమారుడికి టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరినట్లు తెలిసింది. అయితే.. ఒక టికెట్‌ ఇచ్చేందుకు వైసీపీ అంగీకరించినట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమయితే మరో టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.