Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

జగన్ ప్లేస్‌లో ఎన్టీఆర్..ఆ పని చేసిందెవరు..?

గవర్నమెంట్ మారితే..ప్రభుత్వ భవనాల దగ్గర్నుంచి, బస్సులకు..ఆఖరికి రోడ్ డివైడర్స్‌కి వేసే రంగుల వరకు అన్నీ మారుతూనే ఉంటాయ్. ఇవి మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. అగవర్నమెంట్ మారితే..ప్రభుత్వ భవనాల దగ్గర్నుంచి, బస్సులకు..ఆఖరికి రోడ్ డివైడర్స్‌కి వేసే రంగుల వరకు అన్నీ మారుతూనే ఉంటాయ్. ఇవి మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. ధికారంలో ఉన్న పార్టీ తమను రిప్రజెంట్ చేసేలా గవర్నమెంట్ ఆఫీస్‌‌లకు రంగులు వేయడం, ప్రభుత్వ పథకాల నేమ్స్‌ను రిప్లేస్ చెయ్యడం పరిపాటి. తాజాగా ఏపీలో గ్రామ సచివాలయాలకు..వైసీపీ జెండా రంగు వేస్తున్నారని విమర్శలు వచ్చాయి.

అయితే వీటిపై అధికార వైసీపీ డిపెండ్ చేసుకుంటుంది.  గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ చాలా చోట్ల గ్రామ సచివాలయాలకు పసుపు రంగు వేసినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కృష్ణా జిల్లాలో ఓ వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో సచివాలయానికి తెలుపు, ఆకుపచ్చ రంగులు వేశారు. అయితే,  గ్రామానికి చెందిన కొందరు  టీడీపీ కార్యకర్తలు తిరిగి ఆ భవనానికి పసుపు రంగు వేసే ప్రయత్నం చేశారు. అదీకాక, భవనంపై ఉన్న సీఎం జగన్ ఫోటో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్‌ను అతికించారు. దీంతో ఆ ఘటన రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో 17మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.