Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

‘బిగ్ బాస్ 3’ కి తారక్ నో చెప్పేశాడాా?

, ‘బిగ్ బాస్ 3’ కి తారక్ నో చెప్పేశాడాా?

బిగ్ బాస్..బుల్లి తెర షో అయినప్పటికి వెండి తెర హంగులన్నీ ఈ రియాలిటీ షోలో కనిపిస్తాయ్. కొన్ని వివాదాలు చుట్టుముట్టినప్పటికి.. బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సాధించింది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు మూడో సీజన్ ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సీజన్ కు హోస్ట్ గా ఎవరు ఉంటారనే విషయం తెలసుకోవడానికి చాలా రోజుల నుంచి అభిమానులు వెయిట్ చేస్తున్నారు . జూనియర్ ఎన్టీఆర్ ఈ సీజన్ కు వ్యాఖ్యాతగా మరోసారి వ్యవహరించేందుకు రెడీగా ఉన్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం హోస్ట్‌గా చేయడానికి నో చెప్పాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ ను వచ్చే ఏడాది జనవరిలోపే పూర్తి చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఏప్రిల్ నుంచి బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేయడం జరిగిందట. దీంతో ఎన్టీఆర్ కు బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించే సమయం ఉండదనే ఉద్దేశంతో బిగ్ బాస్ నిర్వాహకులకు తన నిర్ణయాన్ని తెలిపాడట. బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు బుల్లితెరను షేక్ చేశాడు. కానీ వివిధ కారణాల వల్ల రెండో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించలేకపోయాడు. ఎన్టీఆర్ స్థానంలో న్యాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా భాద్యతలు తీసుకున్నాడు. నాని మూడో సీజన్ కు ‘నో’ చెప్పడంతో బిగ్ బాస్ నిర్వాహకులు మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారట. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా నో చెప్పాడు కాబట్టి మరో స్టార్ హీరోను వెతకాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఏ స్టార్ హీరో బిగ్ బాస్ హోస్ట్‌గా బుల్లి తెరపై సందడి చేస్తాడో చూడాలి.