Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 20 వేల 903 మంది వైరస్​ సోకింది. మరో 379 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,27,439. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,79,892. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,213.
  • విజయవాడ: మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు. క్రోవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడు వసంతరావు ఆచూకీ లభ్యం. గత నెల 24వ తేది అర్దరాత్రి క్రోవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడు మృతి. అనంతరం మార్చూరుకి తరలించిన వైద్య సిబ్బంది. ఆసుపత్రిలో డాక్టర్లు నిర్లక్ష్యం. వృద్ధుడు వివరాలు ఆసుపత్రి రికార్డుల్లో నమోదుచేయని సిబ్బంది. దింతో మిస్టరీగా మరీనా వసంతారావు మిస్సింగ్. పోలీసుల రంగప్రవేశంతో వృద్ధుడు ఆచూకీ. గత 10 రోజులుగా కుటుంబ సభ్యులు వివరణ కోరిన సరైన వివరణ ఇవ్వని ఆసుపత్రి వర్గాలు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం తో గత 10 రోజులుగా ఆందోళనలో కుటుంబ సభ్యులు.. డాక్టర్లు తీరు పై కుటుంబ సభ్యులు ఆగ్రహం. ఆసుపత్రి సీసీ కెమెరాలలో వృద్ధుడు ఆచూకీ గమనించిన పోలీసులు. మార్చురీలో ఉన్న మృతదేహం వసంతరావుది కావడంతో విషాదంలో కుటుంబo.
  • అమరావతి: మంత్రివర్గ విస్తరణ 22న? రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్దం చేస్తునట్టు సమాచారం. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక పై కసరత్తు?
  • గుంటూరు: అరండల్ పేట పరిధిలో ప్రత్యర్దులను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన ఏడుగురు రౌడీ షీటర్లను అరెస్ట్ చేసిన అర్బన్ పోలీసులు. రమణ అనే వ్యక్తి ని హత్య చేసేందుకు ప్లాన్ చేసిన రౌడీ షీటర్ బసవల వాసు హత్య కేసు నిందితులు.
  • ఎయిమ్స్ నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన చిలకలూరిపేటకు చెందిన ప్రతాప్ కుమార్. వంద మార్కులకు గాను 91 మార్కులు సాధించిన ప్రతాప్ కుమార్.
  • విజయవాడ: మాజీ స్పీకర్ కోడెల కుమారుడు కోడెల శివరాంపై బెజవాడ పోలీసులకు ఫిర్యాదు. 2018లో పొలం కొనుగోలు చేసి 90 లక్షలు ఇవ్వటంలేదని పటమట పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంత్. అధికార బలంతో అప్పట్లో డబ్బు ఇవ్వలేదని, గత ఏడాది నుంచి మధ్యవర్తి రాంబాబుకి ఇచ్చేసాను అని ఇబ్బంది పెడుతున్నట్టు ఫిర్యాదు. మధ్యవర్తి రాంబాబును కలిస్తే రివాల్వర్ తో బెదిరిస్తున్నదని పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంత్. గత నెల 25న ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవటంతో సీపీకి ఫిర్యాదు చేయనున్న అనంత్.
  • క్లినికల్ ట్రైల్స్ కు తెలంగాణలో గ్రీన్ సిగ్నల్ . నిమ్స్ కు పర్మిషన్ ఇచ్చిన ఐసీఎంఆర్ . ఇప్పటికే కోవిడ్ తో పాటు ఇతర వ్యాధుల వారికి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్న కిమ్స్. అనేకసార్లు అనేక వ్యాధులకు వ్యాక్సిన్ ట్రైల్స్ నిర్వహించిన నిమ్స్.

కెసీఆర్ స్టాండ్ కు అపరమేధావి ఫిదా !

jayaprakash supports kcr stand, కెసీఆర్ స్టాండ్ కు అపరమేధావి ఫిదా !

కార్మికుల గొంతెమ్మ కోర్కెలను తోసిపుచ్చి.. ఆర్టీసీని పరిరక్షించేందుకు కంకణం కట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అనూహ్యంగా ఓ మేధావి నుంచి మద్దతు లభించింది. ఛాన్స్ దొరికింది కదాని ఆర్టీసీ సమ్మె సాకుగా కెసీఆర్ పై తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల విధానాలను సునిశితంగా విశ్లేషించే ఓ వ్యక్తి కెసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. స్వాగతించడమే కాకుండా ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న కెసీఆర్ ను దమ్మున్న నాయకునిగా అభివర్ణించారు. ఇంతకీ ఆయనెవరంటే…

jayaprakash supports kcr stand, కెసీఆర్ స్టాండ్ కు అపరమేధావి ఫిదా !

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టసీ సమ్మె అంశంపై కెసీఆర్ విధానాలు పరిపూర్ణంగా సమంజసమేనని అభిప్రాయపడింది ఎవరో కాదు.. అవినీతి రహిత సమాజం కోసం లోక్ సత్తాను స్థాపించి.. ఆతర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చి ఒక దఫా ఎమ్మెల్యేగా కూడా ఎన్నికైన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్.  ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లు పూర్తి అసంబద్దమని జెపి ఖరాఖండీగా తన అభిప్రాయాన్ని వెలువరించారు. అందుకే కెసీఆర్ స్టబర్న్ విధానాలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని చెప్పారు జెపి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సరైన చర్య కాదని, ప్రభుత్వాన్ని శాసించాలనుకునేలా వున్న ఆర్టీసీ యూనియన్ల ధోరణి పూర్తిగా ఖండించదగినదాని జెపి అంటున్నారు.

గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కెసీఆర్ తో విభేధించిన జెపి, తాజాగా ఆర్టీసీ విషయంలో పూర్తిగా సమర్థించడం గమనార్హం. విద్యార్థులతోపాటు ప్రయాణీకులంతా అష్ట కష్టాలు పడుతున్న తరుణంలో ఆర్టీసీ యూనియన్లు  మొండిగా వ్యవహరించడాన్ని పలువురు దుయ్యబడుతున్న తరుణంలో జెపి లాంటి అపర మేధావులు కెసీఆర్ ప్రభుత్వ విధానాలను సమర్థించేలా మాట్లాడడం చర్చనీయాంశమైంది.

Related Tags