ఢిల్లీలో మహిళా జర్నలిస్టుపై కాల్పులు

దేశరాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ మహిళా జర్నలిస్టుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈస్ట్ ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త మిథాలీ చందోలాపై.. ఆదివారం తెల్లవారుజామున దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆమెపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అంతకుముందు మార్గమధ్యలో కారుపై కోడిగుడ్లతో దాడి చేశారని మిథాలీ తెలిపింది. […]

ఢిల్లీలో మహిళా జర్నలిస్టుపై కాల్పులు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 23, 2019 | 4:11 PM

దేశరాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ మహిళా జర్నలిస్టుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈస్ట్ ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త మిథాలీ చందోలాపై.. ఆదివారం తెల్లవారుజామున దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆమెపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అంతకుముందు మార్గమధ్యలో కారుపై కోడిగుడ్లతో దాడి చేశారని మిథాలీ తెలిపింది. కాగా ఈ ఘటనలో బుల్లెట్ తగలడంతో గాయపడ్డ ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందని డాక్టర్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే మిథాలీ కుటుంబంలోని తగాదాలే ఈ దాడికి కారణమై ఉండొచ్చని వారు భావిస్తున్నారు.