యూపీ…జర్నలిస్ట్ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం

యూపీలోని ఘజియాబాద్ లో దుండగుల కాల్పుల్లో మరణించిన జర్నలిస్ట్ విక్రమ్ జోషీ కుటుంబానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ నెల 20 న రాత్రి తన ఇద్దరు కూతుళ్లతో బైక్ పై..

యూపీ...జర్నలిస్ట్ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 22, 2020 | 1:32 PM

యూపీలోని ఘజియాబాద్ లో దుండగుల కాల్పుల్లో మరణించిన జర్నలిస్ట్ విక్రమ్ జోషీ కుటుంబానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ నెల 20 న రాత్రి తన ఇద్దరు కూతుళ్లతో బైక్ పై వెళ్తున్న విక్రమ్ జోషీని సుమారు పది మంది దుండగులు అడ్డగించి ఆయనపై కాల్పులు జరిపారు.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జోషీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. కాగా…. ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, వారి కూతుళ్ళకు ఉచిత విద్యా సౌకర్యం కల్పిస్తామని యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు.

విక్రమ్ జోషీ హత్యకు కారకులైన 10 మందిలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అటు-జోషీ మర్డర్ ని ఖండించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ…యూపీలో రామరాజ్యం కాదని, ‘గూండా రాజ్యం’ నడుస్తోందని దుయ్యబట్టారు. జోషీ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.