టీమిండియా ఫీల్డింగ్ కోచ్: రేసులో మెరుపు ఫీల్డర్ జాంటీ రోడ్స్‌?

టీమిండియా సపోర్ట్ స్టాప్ రేసులో పలు ఆసక్తికర పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ కోచ్‌ మహేళా జయవర్దనె భారత కోచ్‌ పదవికి రేస్‌లో ఉన్నారనే వార్తలు నిన్నమెన్నటివరకు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి. తాజాగా భారత జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ పదవికి గొప్ప ఫీల్డర్‌గా పేరొందిన సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌ దరఖాస్తు చేశారని సమాచారం. ఇంటర్నెట్లో ఇందుకు సంబంధించిన వార్తలు షికారు చేస్తున్నాయి. జాంటీ సైతం ముంబయి ఇండియన్స్‌ బృందం మనిషే కావడం […]

టీమిండియా ఫీల్డింగ్ కోచ్:  రేసులో మెరుపు ఫీల్డర్ జాంటీ రోడ్స్‌?
Follow us

|

Updated on: Jul 25, 2019 | 5:03 AM

టీమిండియా సపోర్ట్ స్టాప్ రేసులో పలు ఆసక్తికర పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ కోచ్‌ మహేళా జయవర్దనె భారత కోచ్‌ పదవికి రేస్‌లో ఉన్నారనే వార్తలు నిన్నమెన్నటివరకు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి. తాజాగా భారత జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ పదవికి గొప్ప ఫీల్డర్‌గా పేరొందిన సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌ దరఖాస్తు చేశారని సమాచారం. ఇంటర్నెట్లో ఇందుకు సంబంధించిన వార్తలు షికారు చేస్తున్నాయి. జాంటీ సైతం ముంబయి ఇండియన్స్‌ బృందం మనిషే కావడం గమనార్హం. పైగా ఆయనకు భారత సంస్కృతి, సంప్రదాయాలంటే ప్రత్యేక అభిమానం. అందుకే తన కూతురికి ఇండియా అని పేరు పెట్టారు.

ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత సొంతదేశానికే ఫీల్డింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. కెన్యాకూ కోచ్‌గా పనిచేశారు. బీసీసీఐ సహాయ సిబ్బంది కోసం ప్రకటన జారీ చేసిన తర్వాత ఎవరెవరు దరఖాస్తులు చేశారో ఇంకా అధికారికంగా తెలియలేదు. దరఖాస్తులకు జులై 30 చివరి తేదీ అన్న సంగతి తెలిసిందే.