అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘విదేశీ జోక్యం’.. జో బిడెన్ ఆందోళన

అమెరికా అధ్యక్ష పదవికి నవంబరు 3 న జరగనున్న ఎన్నికల్లో విదేశీ జోక్యంపై డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా, చైనా, ఇరాన్ మరికొన్ని దేశాలు ఈ పోల్స్ లో జోక్యం చేసుకోజూస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ జోక్యాన్ని..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 'విదేశీ జోక్యం'.. జో బిడెన్ ఆందోళన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 21, 2020 | 5:52 PM

అమెరికా అధ్యక్ష పదవికి నవంబరు 3 న జరగనున్న ఎన్నికల్లో విదేశీ జోక్యంపై డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా, చైనా, ఇరాన్ మరికొన్ని దేశాలు ఈ పోల్స్ లో జోక్యం చేసుకోజూస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ జోక్యాన్ని అమెరికా సార్వభౌమాధికారంపై ఆక్రమణగా ఆయన అభివర్ణించారు. ముఖ్యంగా రష్యా తెరచాటు ‘మద్దతు’ను నివారించడంలో  ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని జో బిడెన్ ఆరోపించారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే  ఈ దేశాల బండారాన్ని బయటపెడతానని, ప్రధానంగా క్రెమ్లిన్ (రష్యా) ఆట కట్టిస్తానని జో బిడెన్ హెచ్ఛరించారు.

అయితే అధ్యక్షుడు ట్రంప్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. రష్యాతో మైత్రిని కొనసాగించినంత మాత్రాన ఆ దేశం ఈ ఎన్నికల్లో ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. తమకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంటూ ఒకటుందని, ఆ వ్యవస్థ ఇచ్ఛే సమాచారంపై ఆధారపడి తాము అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు,