జో బైడెన్ కు స్వల్ప గాయాలు… పెంపుడు కుక్కతో ఆడుకుంటుండగా.. జారిపడ్డ బైడెన్

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ గాయపడ్డారు. ఈ ఘటన తాజాగా వాషింగ్‌టన్‌లో చోటుచేసుకుంది.

  • Balaraju Goud
  • Publish Date - 6:24 am, Mon, 30 November 20
జో బైడెన్ కు స్వల్ప గాయాలు...  పెంపుడు కుక్కతో ఆడుకుంటుండగా.. జారిపడ్డ బైడెన్

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ గాయపడ్డారు. ఈ ఘటన తాజాగా వాషింగ్‌టన్‌లో చోటుచేసుకుంది. జోబైడెన్ కు తన పెంపుడు కుక్కలు అంటే చాలా ఇష్టం. ఇందుకోసం జర్మన్ షెపర్డ్ డగ్స్‌ను పెంచుకుటున్నారు. అయితే, ఉదయం జాగింగ్ సమయంలో తానూ పెంచుకుంటున్న జర్మన్ షెపర్డ్ జాగిలంతో ఆడుకుంటుండగా జారి పడటంతో చీలమండకు గాయమైంది. దీంతో బైడెన్ డెలావేర్ లోని ఆర్థోపెడిక్ డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకున్నారని బైడెన్ కార్యాలయం వెల్లడించింది. జో బైడెన్ రెండు కుక్కలను పెంచుకుంటున్నారు. అందులో 2018లో దత్తత తీసుకున్న మేజర్తో అనే కుక్కతో ఆడుకుంటుండగా జారి పడి గాయపడ్డారు. బైడెన్ 2008లో ఒక కుక్కను దత్తత తీసుకున్నారు. త్వరలో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తనతో పాటు తన రెండు పెంపుడు కుక్కలు కూడా వైట్‌హౌస్‌కు రానున్నాయి.