నేను అధ్యక్షుడైతే…హెచ్-1 బీ వీసాలపై ఆంక్షలు ఎత్తివేస్తా.. జో బిడెన్

రానున్ననవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచిన పక్షంలో హెచ్-1బీ వీసాలపై తాత్కాలికంగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ప్రకటించారు. అమెరికన్లకే ఉద్యోగాలు అని నినాదం ఎత్తుకున్న..

నేను అధ్యక్షుడైతే...హెచ్-1 బీ వీసాలపై ఆంక్షలు ఎత్తివేస్తా.. జో బిడెన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 02, 2020 | 6:08 PM

రానున్ననవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచిన పక్షంలో హెచ్-1బీ వీసాలపై తాత్కాలికంగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ప్రకటించారు. అమెరికన్లకే ఉద్యోగాలు అని నినాదం ఎత్తుకున్న ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్.. హెచ్-1 బీ వీసాలపై తాత్కాలికంగా ఆంక్షలు విధిస్తామని గత జూన్ 23 న ప్రకటించారు. ఇది ముఖ్యంగా ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ కి పెను దెబ్బగా పరిణమిచింది.  ఆయన (ట్రంప్) ఈ ఏడాది చివరి వరకు ఈ వీసాలను నిషేధిస్తున్నట్టు చెప్పాడని, కానీ తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన పక్షంలో ఈ ఆంక్షలను రద్దు చేస్తానని జో బిడెన్ అన్నారు. ఎన్ బీ సీ న్యూస్ ఆధ్వర్యాన  ‘ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐల్యాండర్ ఇస్యూస్’…. డిజిటల్ టౌన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. హెచ్-1 బీ వీసా హోల్డర్లు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. తమ ఇమ్మిగ్రేషన్ పాలసీ కుటుంబాలను కలిపే విధంగా ఉంటుందన్నారు. ..ఈ  ఇమ్మిగ్రేషన్ విధానం దేశానికే ఒక మూల స్తంభంగా  ఉండగలదని పేర్కొన్నారు. ప్రస్తుత సిస్టం లో ట్రంప్ విధానాలు  ‘క్రూరంగా’ ఉన్నాయని  ఆయన ఆరోపించారు. దక్షిణాసియా, తూర్పు దేశాలకు చెందిన లక్ష మందికి పైగా ‘ డ్రీమర్లను’ కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం అని జో బిడెన్ హామీ ఇచ్చారు.

అలాగేముస్లిములకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం పాటిస్తున్న ట్రావెల్ బ్యాన్ ని ఉపసంహరిస్తామని ఆయన చెప్పారు. దేశంలోకి శరణార్ధుల ప్రవేశాన్ని పునరుద్ధరిస్తామని కూడా జో బిడెన్ చెప్పారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..