అమెరికా కొత్త కేబినెట్ కూర్పుపై బైడెన్ కసరత్తు.. ఆర్థిక మంత్రిని ఖరారు చేశామని వెల్లడి..

అమెరికా నూతన ఆర్థిక మంత్రి (ట్రెజరీ సెక్రటరీ)ని ఇప్పటికే ఎంపిక చేసినట్టు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్‌ ప్రకటించారు.

  • Balaraju Goud
  • Publish Date - 4:08 pm, Fri, 20 November 20
అమెరికా కొత్త కేబినెట్ కూర్పుపై బైడెన్ కసరత్తు.. ఆర్థిక మంత్రిని ఖరారు చేశామని వెల్లడి..

అమెరికా నూతన ఆర్థిక మంత్రి (ట్రెజరీ సెక్రటరీ)ని ఇప్పటికే ఎంపిక చేసినట్టు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్‌ ప్రకటించారు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది అప్పుడే వెల్లడించేందుకు బైడెన్ తిరస్కరించారు. ధన్యవాద కార్యక్రమం ముందు లేదా ఆ తర్వాత వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఆ వ్యక్తిని అభ్యుదయ వాదుల నుంచి మితవాదుల కూటమి సహా డెమొక్రాటిక్ పార్టీలోని అన్ని వర్గాలు అంగీకరిస్తాయని నేను భావిస్తున్నానని బైడెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఆర్థిక శాఖకు సేవలు అందించి, ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ గవర్నర్‌గా పనిచేస్తున్న లేల్ బ్రైనార్డ్ ఆర్ధిక మంత్రి పదవి రేసులో ముందున్నట్టు సమాచారం.

కాగా, ఒబామా టీంలో పనిచేసిన మరో ట్రెజరీ అధికారి శారా బ్లూమ్ రస్కిన్‌తో పాటు ఫెడరల్ రిజర్వ్‌‌లో పనిచేసిన జనెత్ ఎల్. ఎలెన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అమెరికా మంత్రివర్గ కూర్పుపై బైడెన్ కసరత్తు మొదలుపెట్టారు. అయితే, ఈసారి ఆయన కేబినెట్ లోకి భారత సంతతికి చెందిన పలువురికి అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. దీంతో భారత్-అమెరికా దేశాల మధ్య మరింతగా సత్సంబంధాలు బలపడే అవకాశముందంటున్నారు విశ్లేషకులు.