‘జో బైడెన్ అధ్యక్షుడైతే ఇండియాకు మంచిది కాదు’ జూనియర్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ గెలిచి ఈ దేశాధ్యక్షుడైతే ఇండియాకు మంచిది కాదని డొనాల్డ్ ట్రంప్ కుమారుడు 42 ఏళ్ళ ట్రంప్ జూనియర్ అన్నారు. బైడెన్ ఇండియాకన్నా చైనా పట్లే చాలా సుముఖంగా ఉంటారని, ఈ విషయం ఇండియన్ అమెరికన్లకు బాగా తెలుసునని ఆయన పేర్కొన్నారు. న్యూయార్క్ లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జో బైడెన్, ఆయన కొడుకు హంటర్ బైడెన్ లపై వఛ్చిన అవినీతి ఆరోపణల మీద […]

'జో బైడెన్ అధ్యక్షుడైతే ఇండియాకు మంచిది కాదు' జూనియర్ ట్రంప్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 19, 2020 | 2:56 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ గెలిచి ఈ దేశాధ్యక్షుడైతే ఇండియాకు మంచిది కాదని డొనాల్డ్ ట్రంప్ కుమారుడు 42 ఏళ్ళ ట్రంప్ జూనియర్ అన్నారు. బైడెన్ ఇండియాకన్నా చైనా పట్లే చాలా సుముఖంగా ఉంటారని, ఈ విషయం ఇండియన్ అమెరికన్లకు బాగా తెలుసునని ఆయన పేర్కొన్నారు. న్యూయార్క్ లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జో బైడెన్, ఆయన కొడుకు హంటర్ బైడెన్ లపై వఛ్చిన అవినీతి ఆరోపణల మీద జూనియర్ ట్రంప్.. ‘లిబరల్ ప్రివిలేజ్’ అనే పేరిట ఓ పుస్తకం రాశారు. చైనా ప్రభుత్వం హంటర్ కి 1.5 బిలియన్ డాలర్లను అందజేసిందని, ఇందువల్ల అయన తండ్రి అమెరికా అధ్యక్షుడైతే తమ దేశం పట్ల చాలా మెతకగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్టు కనిపిస్తోందని జూనియర్ ట్రంప్ పేర్కొన్నారు, హంటర్ పెద్ద బిజినెస్ మన్ కూడా.. ఆయనపైనా చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని జూనియర్ చెప్పారు.