పుత్ర ప్రేమ మరి ! నా కుమారుడు నీతిమంతుడు, అతనిపై ఆరోపణలు నిరాధారం, నమ్మకండి, జో బైడెన్.

తన కుమారుడు హంటర్ ని అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ పూర్తిగా సమర్థించారు. అతనిపై తమకెంతో నమ్మకం ఉందన్నారు. పన్ను ఎగవేశారంటూ హంటర్ పై వచ్చిన ఆరోపణలు..

పుత్ర ప్రేమ మరి ! నా కుమారుడు నీతిమంతుడు, అతనిపై ఆరోపణలు నిరాధారం,  నమ్మకండి, జో బైడెన్.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 20, 2020 | 4:43 PM

తన కుమారుడు హంటర్ ని అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ పూర్తిగా సమర్థించారు. అతనిపై తమకెంతో నమ్మకం ఉందన్నారు. పన్ను ఎగవేశారంటూ హంటర్ పై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, అసలు ఇదంతా ‘ఫౌల్ ప్లే’ అని ఆయన వ్యాఖ్యానించారు.  హంటర్ మంచితనం అందరికీ తెలిసిందేనని, అతడు మంచిగా ఉన్నంతకాలం తాము కూడా మంచిగానే ఉంటామని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనేక సందర్భాల్లో హంటర్ మీద ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్న విషయం గమనార్హం. బైడెన్ కుటుంబం అవినీతి కుటుంబమని, హంటర్ నిర్వహిస్తున్న బిజినెస్ లావాదేవీల్లో ఎన్నో అక్ర మాలు జరిగాయని ఆయన విమర్శించారు. ఉక్రెయిన్, చైనా  దేశాల్లో హంటర్ కు బిజినెస్ సంస్థలున్నాయి.

2014-2019 మధ్యకాలంలో తన తండ్రి బైడెన్ అమెరికా ఉపాధ్యక్షునిగా ఉన్నప్పుడు హంటర్ ముఖ్యంగా ఉక్రెయిన్ లో ఓ గ్యాస్ కంపెనీ వ్యవహారాలు చూస్తూ వచ్చారు. అదేకాలంలో హంటర్ రష్యన్ల నుంచి, చైనా, ఉక్రెయిన్ దేశాల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారని ట్రంప్..తన ప్రచారం  నందర్భంగా దుయ్యబట్టారు. లాయర్, లాబీయిస్టు కూడా అయిన 50 ఏళ్ళ హుంటర్  అవినీతిపై పై విచారణ జరగాలని ఆయన చాలా సందర్భాల్లో డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను హంటర్ ఖండిస్తున్నారు. తన పన్ను వివరాలను ఎప్పుడైనా తనిఖీ చేసుకోవచ్చునని ట్రంప్ పై ఎదురు దాడికి దిగుతూ వచ్చారు.

ఏమైనా జో బైడెన్ మాత్రం ట్రంప్ ఆరోపణలను తేలిగ్గా తీసుకున్నారు. మా కుటుంబాన్ని వేరు చేయడానికి ట్రంప్ యత్నిస్తున్నారు,, సంతోషం అని ఆయన వ్యాఖ్యానించారు.