‘జోడి’తో వస్తున్న ఆది..!

‘ప్రేమకావాలి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు ఆది సాయికుమార్. ఈ సినిమా తర్వాత పలు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన ఆది ఇప్పటివరకు సోలో హిట్ అందుకోలేదు. అయితే తాజాగా ఆది హీరోగా విశ్వనాథ్ దర్శకత్వంలో ‘జోడి’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. ఈరోజు ఉగాది పండగ పర్వదినాన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా […]

'జోడి'తో వస్తున్న ఆది..!
Follow us

|

Updated on: Apr 06, 2019 | 5:57 PM

‘ప్రేమకావాలి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు ఆది సాయికుమార్. ఈ సినిమా తర్వాత పలు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన ఆది ఇప్పటివరకు సోలో హిట్ అందుకోలేదు. అయితే తాజాగా ఆది హీరోగా విశ్వనాథ్ దర్శకత్వంలో ‘జోడి’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. ఈరోజు ఉగాది పండగ పర్వదినాన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆదిని కొత్త కోణంలో చూపించనున్నాడట దర్శకుడు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేష్, పద్మజ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం దసరాకు విడుదల కానుందని సమాచారం.