భారీగా కల్తీ నెయ్యి స్వాధీనం.. నలుగురు అరెస్ట్..

రాజస్థాన్‌లో కల్లీ నెయ్యి తయారీ కలకలం రేపింది. ఇంట్లోనే కుటీర పరిశ్రమలా ఏర్పాటు చేసుకుని.. డబ్బాల్లో అమ్ముతున్న ముఠాకు జోధ్‌పూర్ పోలీసులు చెక్ పెట్టారు.

భారీగా కల్తీ నెయ్యి స్వాధీనం.. నలుగురు అరెస్ట్..
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2020 | 12:24 PM

కల్లీ నెయ్యి ముఠాకు చెక్‌పెట్టారు రాజస్థాన్‌కి చెందిన జోధ్‌పూర్ పోలీసులు. నగరంలోని ఓ ఇంట్లో కల్తీ నెయ్యిని తయారు చేస్తూ.. డబ్బాల్లో మార్కెట్‌లో అమ్ముతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు.. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. బుధవారం రాత్రి.. ఆరోగ్య శాఖ అధికారులు, జోధ్‌పూర్ పోలీసుల సహాయంతో సదరు ఇంటిపై ఆకస్మిక తనిఖీలు చేశారు. దీంతో ఇంట్లో పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి డబ్బాలు దర్శనమిచ్చాయి. మొత్తం 200కు పైగా డబ్బాల్లో కల్తీ నెయ్యి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు.. మరికొన్ని డబ్బాలు మూడు నుంచి ఐదేళ్ల క్రితానికి చెందిన నెయ్యి డబ్బాలను కూడా గుర్తించారు. ఘటనపై ఆరోగ్య శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనపై కేసు నమోదుచేసుకుని.. 200 నెయ్యి డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దీనిపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.