వేతన జీవుల కళ్లన్నీ బడ్జెట్ పైనే.. కరుణిస్తారా ? కొరడా ఝళిపిస్తారా ?

ఆర్ధికమంత్రి సీతారామన్ మరికొద్దిసేపట్లో కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో ముఖ్యంగా ఉద్యోగాల కల్పన, ఆర్ధిక ప్రగతి.. ఈ రెండింటి పైనే ఫోకస్ పెట్టనున్నారు. ఇన్వెస్టిమెంట్లు, ఆదాయపు పన్ను ప్రయోజనాలు, బ్యాంకింగ్ సంస్కరణలు, వ్యవసాయ వృద్ది, మహిళలకు పన్ను రాయితీలు, ఆరోగ్య రంగం, డిఫెన్స్ మోడర్నైజేషన్, స్టాక్ మార్కెట్లకు రిలీఫ్, టూరిజం రంగ అభివృధ్ది,… ఈ పది అంశాలు ప్రధానంగా ఆమె బడ్జెట్లోని అజెండాగా ఉండనున్నాయి. ఇక మధ్యతరగతి వర్గాలు ఆశగా […]

వేతన జీవుల కళ్లన్నీ బడ్జెట్ పైనే.. కరుణిస్తారా ? కొరడా ఝళిపిస్తారా ?
Follow us

|

Updated on: Jul 05, 2019 | 10:43 AM

ఆర్ధికమంత్రి సీతారామన్ మరికొద్దిసేపట్లో కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో ముఖ్యంగా ఉద్యోగాల కల్పన, ఆర్ధిక ప్రగతి.. ఈ రెండింటి పైనే ఫోకస్ పెట్టనున్నారు. ఇన్వెస్టిమెంట్లు, ఆదాయపు పన్ను ప్రయోజనాలు, బ్యాంకింగ్ సంస్కరణలు, వ్యవసాయ వృద్ది, మహిళలకు పన్ను రాయితీలు, ఆరోగ్య రంగం, డిఫెన్స్ మోడర్నైజేషన్, స్టాక్ మార్కెట్లకు రిలీఫ్, టూరిజం రంగ అభివృధ్ది,… ఈ పది అంశాలు ప్రధానంగా ఆమె బడ్జెట్లోని అజెండాగా ఉండనున్నాయి. ఇక మధ్యతరగతి వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్న ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారా అన్నది ముఖ్యాంశంగా మారింది. ప్రస్తుతం ఈ పరిమితి రెండున్నర లక్షలుంది. . అయితే దీన్ని కనీసం మూడు లక్షలకు పెంచవచ్చునని భావిస్తున్నారు. . అలాగే ఉద్యోగాల కల్పన. మోదీ ప్రభుత్వాన్ని ఇటీవల ఇది తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. నిన్నటి ఎకనమిక్ సర్వేలో కూడాచీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. ఇక బ్యాంకు రుణాల రికవరీ, స్టాక్ మార్కెట్ స్థితిగతుల నేపథ్యంలో ఇన్వెస్టర్లకు రాయితీలు, టూరిజం వంటివి ఈ బడ్జెట్లో ప్రధానాంశాలు. స్టాక్ మార్కెట్ కు సంబంధించి టాక్స్ కలెక్షన్స్ పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో.. పెట్టుబడిదారులకు రాయితీలు కల్పిస్తారన్నది అనుమానమే.. ఇన్వెస్టిమెంట్లు పెంచేందుకు మార్గాలు వెదుకుతున్న మోదీ ప్రభుత్వం ఇందుకు పూనుకొంటుందని భావించలేమని అంటున్నారు ఇక లేబర్ పార్టిసిపేషన్..అంటే ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఉపాధి పెంచేందుకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ కొన్ని ప్రత్యేక పథకాలు ప్రకటించవచ్చునని భావిస్తున్నారు. . టూరిజం రంగాన్ని అభివృధ్ది పరచేందుకు రైల్వేల ఆధునీకరణపై దృష్టి పెట్టి.. ‘ ఉడాన్ ‘ వంటి పథకాలకు ఈ బడ్జెట్ ‘ ఊపు ‘ నివ్వవచ్ఛు . ఆరోగ్యరంగానికి మరిన్ని నిధులు కేటాయించవచ్ఛు. అలాగే గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు గృహ రుణాలపై వడ్డీని తగ్గించవచ్ఛునని భావిస్తున్నారు.