జేఎన్‌యూలో కరోనా కలకలం.. ఫార్మసిస్ట్‌కు పాజిటివ్..

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ హెల్త్‌ సెంటర్‌లో కరోనా కలకలం రేగింది. అందులోని ఓ ఫార్మసిస్ట్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.

జేఎన్‌యూలో కరోనా కలకలం.. ఫార్మసిస్ట్‌కు పాజిటివ్..
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 11:02 PM

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ హెల్త్‌ సెంటర్‌లో కరోనా కలకలం రేగింది. అందులోని ఓ ఫార్మసిస్ట్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం నాడే సదరు ఫార్మసిస్ట్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలిందని అక్క్డడి అధికారులు తెలిపారు. జిల్లా నిఘా విభాగం జేఎన్‌యూ హెల్త్ సెంటర్‌ను సందర్శించి.. అక్కడి పరిస్థితులను ఆరా తీశారు. అక్కడి విధ్యార్దులు ఎవరైనా కాంటాక్ట్‌ అయితే.. వివరాలు తెలపాలని.. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక హెల్త్ సెంటర్‌ను కానీ.. గవర్నమెంట్‌ ఆస్పత్రిని కానీ సంప్రదించాలని అధికారులు సూచించారు. అందరు కూడా ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ను పాటించాలని కోరారు.

మరోవైపు ఢిల్లీలోని అన్ని విభాగాలకు చెందిన కార్యాలయాలకు కరోనా సోకుతుంది. ఇప్పుడు జే.ఎన్.యూ ను కూడా తాకింది. ఇప్పటికే ఈడీ కార్యాలయంలోని అధికారులకు కూడా కరోనా సోకింది. తాజాగా ఆదివారం నాడు ఏపీ భవన్ లోని ఓ అధికారికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వీటన్నింటిని శానిటైజ్ చేస్తున్నారు.