బీటెక్ పరీక్షల నిర్వహణకు మార్గదర్శకాలు..!

జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాల జరగాల్సిన పరీక్షలను జూన్ 20 వ తేదీ నుంచి మొదలవుతాయని ప్రకటించింది. 4వ సంవత్సరం రెండో సెమిష్టర్ బి.టెక్/బి.ఫార్మా, ఎంబీఏ, ఎంటెక్ పరీక్షలు. పరీక్షల నిర్వహణకు నూతన గైడ్ లైన్స్.

బీటెక్ పరీక్షల నిర్వహణకు మార్గదర్శకాలు..!
Follow us

|

Updated on: Jun 04, 2020 | 8:05 PM

కరోనా వైరస్ నేఫథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల పరీక్షలు నిలిచిపోయాయి. ఇక లాక్ డౌన్ సడలింపులతో పరీక్ష తేదీలను ప్రకటిస్తున్నాయి యూనివర్సిటీలు. తాజాగా జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాల జరగాల్సిన పరీక్షలను జూన్ 20 వ తేదీ నుంచి మొదలవుతాయని ప్రకటించింది. 4వ సంవత్సరం రెండో సెమిష్టర్ బి.టెక్/బి.ఫార్మా, ఎంబీఏ, ఎంటెక్ వారికి మాత్రమే పరీక్ష నిర్వహిస్తున్నట్లు జెఎన్టీయూ తెలిపింది. పరీక్షల నిర్వహణకు సంబంధించిన మార్గర్శకాలను జేఎన్టీయూ విడుదల చేసింది. లాక్ డౌన్ కారణంగా 4th ఇయర్ 2nd సెమిస్టర్ పరీక్షకు హాజరు కాలేని వారు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇక సెకండ్ మిడ్ టర్మ్ పరీక్షల షెడ్యూల్ ను వారం రోజులలో విడుదల చేయనున్న జెఎన్టీయూ అధికారులు తెలిపారు.

హైదరాబాదు పరిధిలోని కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు నూతన గైడ్ లైన్స్:

# విద్యార్థి చదివే కళాశాలలోనే పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు. # ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్క్ ధరించి పరీక్షకు హాజరు కావాలి. # మాస్క్ ధరించిన విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి. # పరీక్షా కేంద్రాలలో, లాబోరేటరీస్ లో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు ఉండాలి. # ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా థర్మల్ స్కానింగ్ నిర్వహించి లోనికి అనుమతించాలి. # అన్ని ఎండ్ సెమిస్టర్ పరీక్షల సమయం రెండు గంటలకు కుదింపు. # ఎనిమిది ప్రశ్నలలో ఐదింటికి విద్యార్థి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. # 2020-21 విద్యా సంవత్సరానికి క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానం నిలిపివేత.