జియోమార్ట్ బంపర్ ఆఫర్.. ఫ్రీ డెలివరీతో పాటు ఫ్రీగా కరోనా కిట్..

జియో మార్ట్ బీటా వర్షన్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కిరాణా వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సందర్బంగా తమ వెబ్‌సైట్ ద్వారా నిత్యావసర సరుకులను కొనుగోలు చేసిన కస్టమర్లకు జియో మార్ట్ పలు ఆఫర్లు ప్రకటించినట్లు ఈషా అంబానీ తెలిపారు. ఎంఆర్పీపై 5-10 శాతం డిస్క్ంట్‌తో పాటు ఇతర ఆఫర్లతో..

జియోమార్ట్ బంపర్ ఆఫర్.. ఫ్రీ డెలివరీతో పాటు ఫ్రీగా కరోనా కిట్..
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 2:08 PM

వినియోగదారులకు బంపర్ ఆఫర్స్ ప్రకటించింది జియో మార్ట్. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో రిలయన్స్ తమ సేవలను ప్రారంభించింది. తాజాగా జరిగిన రిలయన్స్ 43వ వార్షిక సమావేశంలో ఈషా అంబానీ మాట్లాడుతూ.. త్వరలోనే పూర్తి స్థాయిలో జియో మార్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. వినియోగదారులకు ఇంటి వద్దకే నాణ్యమైన సరుకులను అందజేయడానికి జియోమార్టును తీసుకొస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

జియో మార్ట్ బీటా వర్షన్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కిరాణా వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సందర్బంగా తమ వెబ్‌సైట్ ద్వారా నిత్యావసర సరుకులను కొనుగోలు చేసిన కస్టమర్లకు జియో మార్ట్ పలు ఆఫర్లు ప్రకటించినట్లు ఈషా అంబానీ తెలిపారు. ఎంఆర్పీపై 5-10 శాతం డిస్క్ంట్‌తో పాటు ఇతర ఆఫర్లతో నిత్యావసర సరుకులను నేరుగా ఇంటికే చేరవేస్తారన్నారు. అలాగే ఎలాంటి మినిమ్ ఆర్డర్ వ్యాల్యూ లేకుండానే సున్నా డెలివరీ ఛార్జీతో సరుకులను వినియోగదారులకు అందజేస్తున్నాం. ఇక జియో మార్ట్ ద్వారా ఫస్ట్ ఆర్డర్ చేసిన వారికి మాస్కులు, శానిటైజర్లతో పాటు ఉచితంగా కరోనా కిట్స్‌ను కూడా అందజేస్తామని చెప్పారు.

అంతేకాకుండా స్వయంగా రైతులు పండించిన కూరగాయలు, పండ్లను వినియోగదారులకు చేరస్తామన్నారు. నిత్యావసర సరుకులతో పాటు ఫ్యాషన్, మెడిసిన్, ఎలక్ట్రానిక్ష్ వస్తువులు కూడా జియో మార్ట్ ద్వారా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ఈషా అంబానీ వెల్లడించారు.

Read More: 

కరోనాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ వైరస్ రాని వ్యక్తి ఉండకపోవచ్చు..

తిరుమలలో అర్చకులకు కరోనా.. టీటీడీ ఛైర్మన్ అత్యవసర భేటీ..

దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు..