గుడ్‌‌న్యూస్ : జియో సెట్‌టాప్ బాక్సులు వచ్చేస్తున్నాయోచ్..!!

జియో.. ఈ పేరు వింటే చాలు.. అపరిమిత కాల్స్, డాటాకి కేర్‌ ఆఫ్ అడ్రస్‌. అయితే కాల్స్ విషయంలో ఈ మధ్య నామమాత్రపు రుసుమును వసూలు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు టెలికాం, ఇంటర్నెట్ రంగాల్లోనే సంచలనం సృష్టించిన జియో.. ఇటీవలే ఫైబర్ గ్రిడ్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో ముందడుగు వేయబోతోంది జియో. ఫైబర్ గ్రిడ్ లాంఛింగ్ సమయంలో తొలుత దీంతోనే వినియోగదారులకు హై స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటుగా.. లైవ్ టెలివిజన్ […]

గుడ్‌‌న్యూస్ : జియో సెట్‌టాప్ బాక్సులు వచ్చేస్తున్నాయోచ్..!!
Follow us

| Edited By:

Updated on: Oct 30, 2019 | 10:39 PM

జియో.. ఈ పేరు వింటే చాలు.. అపరిమిత కాల్స్, డాటాకి కేర్‌ ఆఫ్ అడ్రస్‌. అయితే కాల్స్ విషయంలో ఈ మధ్య నామమాత్రపు రుసుమును వసూలు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు టెలికాం, ఇంటర్నెట్ రంగాల్లోనే సంచలనం సృష్టించిన జియో.. ఇటీవలే ఫైబర్ గ్రిడ్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో ముందడుగు వేయబోతోంది జియో. ఫైబర్ గ్రిడ్ లాంఛింగ్ సమయంలో తొలుత దీంతోనే వినియోగదారులకు హై స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటుగా.. లైవ్ టెలివిజన్ సేవలను కూడా అందించేందుకు సిద్ధమైంది. అయితే జియో దూకుడు అప్పట్లో ట్రాయ్ బ్రేకులు వేసింది. దీంతో జియో కాస్త వెనుకడుగు వేసింది. తాజాగా ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా అడుగులు వేస్తూ.. తన కొత్త పథకాలను అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే వినియోగదారుల ముందుకు త్వరలో సెట్‌టాప్ బాక్సులు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఫైబర్ గ్రిడ్ ఉపయోగిస్తున్న కస్టమర్లతో పాటు, కొత్త కస్టమర్లకు జియోఫైబర్ సెట్-టాప్ బాక్స్‌లు డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

జియో వార్షిక ప్లాన్లు తీసుకున్న వారికి జియోఫైబర్ సెట్-టాప్ బాక్స్‌తో పాటు ఇతర డివైజ్‌లు డిసెంబర్‌లో లభిస్తాయని డేటాక్వెస్ట్ అనే ఆంగ్ల పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు.. అదే నెలలో జియోఫైబర్ సెట్‌టాప్ బాక్స్‌తో పాటు లైవ్ టెలివిజన్ సేవలు కూడా ప్రారంభం కానున్నట్లు అందులో పేర్కొంది. జియో వార్షిక ప్లాన్లు తీసుకున్న వినియోగ దారులకు ఉచితంగా 4కే టీవీ సెట్స్ కూడా లభించనున్నట్లు ఆ కథనంలో  తెలిపింది. అయితే జియో సెట్‌టాప్ బాక్సులు, 4కే టీవీల గురించి వస్తున్న వార్తలపై రిలయెన్స్ జియో నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కాగా, ప్రస్తుత జియో ఫైబర్ గ్రిడ్ కస్టమర్లు, కొత్త యూజర్లు.. జియోఫైబర్ ఇన్‌స్టాలేషన్ చేస్తున్న సమయంలో టెక్నీషియన్లను సెట్-టాప్ బాక్సుల గురించి అడిగితే ఈ ఏడాది చివరినాటికి వస్తాయంటూ చెబుతున్నారట.

ఇక ఈ జియోఫైబర్ సెట్-టాప్ బాక్స్‌తో ఐపీటీవీ సేవల్ని పొందొచ్చు. అంటే దీనికోసం ప్రత్యేకంగా డీటీహెచ్ కనెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తొలుత స్థానిక కేబుల్ ఆపరేటర్లతో కలిసి.. రిలయన్స్ జియో కేబుల్ సేవల్ని అందించాలని భావించింది. అయితే ఎంఎస్ఓలు, స్థానిక కేబుల్ ఆపరేటర్లతో.. జియో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదన్న వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జియో ఫైబర్ గ్రిడ్ వినియోగదారులకు ఐపీటీవీ సేవల్ని అందించనుందన్న చర్చ జరుగుతోంది. మరికొద్ది రోజులు వేచి చూస్తే.. ఈ సెట్‌టాప్ బాక్సుల విషయంలో క్లారిటీ రానుంది.

వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!