ఎయిర్‌టెల్‌కి ధీటుగా.. జియో అదిరిపోయే బంపర్ ఆఫర్..

టెలికాం రంగంలోకి మళ్లీ ఆఫర్ల పోటీ పెరిగిపోయింది. మొన్నటి వరకు వినియోగదారుల నుంచి డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా టారీఫ్ రేట్లను క్రమక్రమంగా పెంచిన ఆపరేటర్లు.. ఇప్పుడు సర్వీసులను అందజేయడంలో పోటీపడుతున్నారు. ఇలా చేయడం ద్వారా వినియోగదారులను చేజారకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జియో.. తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఇక వైఫై ద్వారా.. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. దీనికి అదనంగా ఎలాంటి రుసుము వసూలు చేసేది లేదని పేర్కొంది. భారత […]

ఎయిర్‌టెల్‌కి ధీటుగా.. జియో అదిరిపోయే బంపర్ ఆఫర్..
Follow us

| Edited By:

Updated on: Jan 09, 2020 | 4:39 AM

టెలికాం రంగంలోకి మళ్లీ ఆఫర్ల పోటీ పెరిగిపోయింది. మొన్నటి వరకు వినియోగదారుల నుంచి డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా టారీఫ్ రేట్లను క్రమక్రమంగా పెంచిన ఆపరేటర్లు.. ఇప్పుడు సర్వీసులను అందజేయడంలో పోటీపడుతున్నారు. ఇలా చేయడం ద్వారా వినియోగదారులను చేజారకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జియో.. తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఇక వైఫై ద్వారా.. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. దీనికి అదనంగా ఎలాంటి రుసుము వసూలు చేసేది లేదని పేర్కొంది.

భారత దేశంలో ఉన్న ఏ వైఫై నెట్‌వర్క్‌ నుంచైనా ఈ సర్వీస్‌ పనిచేయనుంది. ప్రసుత్తం 150 రకాల స్మార్ట్‌ ఫోన్లలో ఈ వైఫై ద్వారా వాయిస్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చని పేర్కొంది. వైఫై కాలింగ్‌ సౌలభ్యం దేశ వ్యాప్తంగా జనవరి16 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్‌ సపోర్ట్‌ చేస్తుందో లేదో అన్నది తెలుసుకునేందుకు jio.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ జియో వైఫై కాలింగ్‌ ఉపయోగించాలంటే.. స్మార్ట్‌ఫోన్లలో సెట్టింగ్స్‌‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది.

కాగా, ఇంతకు ముందు ఎయిర్‌టెల్‌ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, ఏపీలో మాత్రమే ‘ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌’ పేరుతో కస్టమర్లకు సర్వీసులను అందించింది. అయితే తాజాగా జియో మాత్రం ఫ్రీ వైఫై కాలింగ్‌ సర్వీసులను.. దేశవ్యాప్తంగా కల్పించనుంది.