నేడే జియో ఫైబర్ లాంఛింగ్.. ప్రత్యేకతలేవంటే..!

టెలికామ్ రంగంలో సంచలనాలు సృష్టిస్తూ.. కస్టమర్లను పెంచుకుంటోన్న రిలియెన్స్ జియో నుంచి ఇప్పుడు బ్రాడ్‌బ్రాండ్, డీటీహెచ్ సేవలు వచ్చేస్తున్నాయి.నేడు రిలియెన్స్ జియో ఫైబర్ అధికారికంగా ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం జియో వెబ్‌సైట్ ద్వారా ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లను పూర్తయ్యాయి. ఇక టారిఫ్, ప్లాన్స్ అన్నీ ఇవాళ వెల్లడించనున్నారు. మొదట హైదరాబాద్‌తో పాటు ముంబై, అహ్మదాబాద్, సూరత్, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, వడోదర, విశాఖపట్నం లాంటి నగరాల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. కాగా జియో ఫైబర్ ప్లాన్స్ […]

నేడే జియో ఫైబర్ లాంఛింగ్.. ప్రత్యేకతలేవంటే..!
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2019 | 9:27 AM

టెలికామ్ రంగంలో సంచలనాలు సృష్టిస్తూ.. కస్టమర్లను పెంచుకుంటోన్న రిలియెన్స్ జియో నుంచి ఇప్పుడు బ్రాడ్‌బ్రాండ్, డీటీహెచ్ సేవలు వచ్చేస్తున్నాయి.నేడు రిలియెన్స్ జియో ఫైబర్ అధికారికంగా ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం జియో వెబ్‌సైట్ ద్వారా ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లను పూర్తయ్యాయి. ఇక టారిఫ్, ప్లాన్స్ అన్నీ ఇవాళ వెల్లడించనున్నారు. మొదట హైదరాబాద్‌తో పాటు ముంబై, అహ్మదాబాద్, సూరత్, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, వడోదర, విశాఖపట్నం లాంటి నగరాల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.

కాగా జియో ఫైబర్ ప్లాన్స్ రూ.700 నుంచి రూ.10,000 మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది. అందులో ఏఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో ఇవాళ తెలియనుంది. అయితే రూ.700 ప్లాన్ ఎంచుకున్న వారికి 100 ఎంబీపీసీ స్పీడ్‌తో డేటా లభించుందని.. గరిష్టంగా 1జీబీపీఎస్ స్పీడ్‌తో డేటా పొందొచ్చునని సమాచారం. ఇక జియో ఫైబర్ ఇన్‌స్టాలేషన్, కనెక్షన్‌కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని జియో సంస్థ స్పష్టం చేసింది. అయితే, రూటర్ కోసం మాత్రం రూ. 2,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, ఆ మొత్తాన్ని రిఫండ్ చేస్తామని కూడా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అంతేకాదు గిగాఫైబర్ యాన్యువల్ ప్లాన్ తీసుకున్నవారికి హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీతో పాటు సెట్ టాప్ బాక్స్ ఉచితంగా లభించనుందని తెలుస్తోంది. ‘జియో ఫరెవర్ యాన్యువల్ ప్లాన్స్’ పేరుతో ఈ ఆఫర్ అందుబాటులో రాబోతున్నట్లు సమాచారం. ఇక జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు సినిమా రిలీజైన రోజే ఇంట్లో టీవీలో చూసే అవకాశం కలగనుంది. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పేరుతో ఈ సర్వీస్‌లో ఏ సినిమా ఎప్పుడు రిలీజైనా ఇంట్లోనే చూడొచ్చు. కేవలం ప్రీమియం కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. వచ్చే ఏడాదిలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.