పిల్లాడి ఆకలి తీర్చిన రైల్వే పోలీస్

మెహరున్నీసా అనే మహిళ నాలుగు నెలల పిల్లవాడితో బెంగుళూరు నుంచి గోరఖ్‌పూర్‌కు శ్రామిక్‌ రైల్లో బయలు దేరింది. పాల కోసం ఏడుస్తున్న బాబుకి ఇంటి నుంచి పాలసీసాను తెచ్చి ఇచ్చిన పోలీస్‌ అధికారి సుశీల.

పిల్లాడి ఆకలి తీర్చిన రైల్వే పోలీస్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2020 | 6:47 PM

పోలీసుల్లో కఠినత్వమే కాదు మానవత్వం కూడా ఉందని నిరూపించాడు ఓ రైల్వే పోలీస్. లాక్‌డౌన్‌లో అష్టకష్టాలు పడుతున్న జనానికి దాతలు ఎదో విధంగా సాయం అందిస్తూనే ఉన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తనకున్న దాంట్లో ఎంతో కొంత అందించి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. నాలుగు నెలల పిల్లవాడితో మెహరున్నీసా అనే మహిళ బెంగుళూరు నుంచి గోరఖ్‌పూర్‌కు శ్రామిక్‌ రైల్లో బయలు దేరింది. అయితే, బాబు పాల కోసం ఏడవడంతో రైలు హటియా రైల్వే స్టేషన్‌ చేరుకోగానే తల్లి తన పిల్లవాడి పాల కోసం వెతికింది. ఎంతకి దొరకకపోవడంతో స్థానికంగా ఉన్న రైల్వే పోలీసుకు విషయాన్ని చెప్పింది. మెహరున్నీసా దీన స్థితిని స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సుశీల అనే మహిళా పోలీస్‌ అధికారి తెలుసుకుంది. వెంటనే స్టేషన్‌కు సమీపంలో ఉన్న తన ఇంటికి వెళ్లి శిశువు కోసం పాల సీసాను తీసుకొచ్చి ఇచ్చింది. ఈ విషయాన్ని రాంచీ పోలీస్‌ అధికారులు ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్‌లో పోలీసు అధికారి పాల సీసాను మెహరున్నీసాకు అందించిన ఫోటోను కూడా రాంచీ అధికారులు సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. కాగా గత నెలలో ఇలాంటి ఘటనే భోపాల్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. రైలులో గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారికి ఆర్‌పీఎఫ్‌ జవాన్‌ పాల ప్యాకెట్‌ కొని తెచ్చి రియల్‌ హీరో అనిపించుకున్నాడు.