ప్రారంభమైన జార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్..

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8.00 గంటలకు కౌటింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు అయిదు విడతల్లో.. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఎన్నికలు జరిగాయి.  విజయంపై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. అయితే  ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ మాత్రం అధికార బీజేపీకి మొండిచెయ్యి చూపించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్నీ.. బీజేపీకి వ్యతిరేకంగానే వచ్చాయి. ఈ […]

ప్రారంభమైన జార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్..
Follow us

| Edited By:

Updated on: Dec 23, 2019 | 2:56 PM

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8.00 గంటలకు కౌటింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు అయిదు విడతల్లో.. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఎన్నికలు జరిగాయి.  విజయంపై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. అయితే  ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ మాత్రం అధికార బీజేపీకి మొండిచెయ్యి చూపించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్నీ.. బీజేపీకి వ్యతిరేకంగానే వచ్చాయి. ఈ సారి కాంగ్రెస్, జేఎమ్ఎమ్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.

ఇదిలా ఉంటే.. 2014లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 37 స్థానాల్లో విజయం సాధించగా.. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు 5, జార్ఖండ్ ముక్తి మోర్చా 19, కాంగ్రెస్ పార్టీకి 6 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక జేవీఎం (పీ) పార్టీ తరఫున గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. అయితే ఈ సారి జరిగిన ఎన్నికల్లో.. కాంగ్రెస్, జేఎమ్ఎమ్, ఆర్ఎల్డీ కలసి ఉమ్మడిగా పోటీ చేశాయి. జేఎంఎం 43, కాంగ్రెస్ 31, ఆర్జేడీ 7 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ.. 79 స్థానాల్లో పోటీ చేసింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 52, జార్ఖండ్ వికాస్ మోర్చా 81 స్థానాల్లో బరిలోకి దిగాయి.

కాగా, జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు.. ఏ పార్టీకైనా 42  మంది ఎమ్మెల్యేలు అవసరం.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!