ఝార్ఖండ్ ఫలితాలు: 24 ఏళ్లలో.. తొలి ఓటమి

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. జంషెడ్‌పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన స్వతంత్ర్య అభ్యర్థి సరయి రాయ్ చేతిలో 8వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే సరయి రాయ్ బీజేపీ రెబల్ అభ్యర్థి కావడం గమనర్హం. రఘుబర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన రాయ్, ఈ ఎన్నికల్లో తనకు జంషెడ్‌పూర్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే […]

ఝార్ఖండ్ ఫలితాలు: 24 ఏళ్లలో.. తొలి ఓటమి
Follow us

| Edited By:

Updated on: Dec 24, 2019 | 9:25 AM

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. జంషెడ్‌పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన స్వతంత్ర్య అభ్యర్థి సరయి రాయ్ చేతిలో 8వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే సరయి రాయ్ బీజేపీ రెబల్ అభ్యర్థి కావడం గమనర్హం. రఘుబర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన రాయ్, ఈ ఎన్నికల్లో తనకు జంషెడ్‌పూర్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే దానికి బీజేపీ నిరాకరించడంతో ఆయన రెబల్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ముందుగా అనుకున్న జంషెడ్‌పూర్ పశ్చిమ కాకుండా రఘుబర్ పోటీ చేసిన తూర్పు నియోజకవర్గం నుంచి రాయ్ బరిలో దిగి.. ఆయనపై గెలిచారు.

అయితే 1995 నుంచి రఘుబర్ దాస్ జంషెడ్‌పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. ఐదు సార్లు అంటే దాదాపుగా 24సంవత్సరాలు ఆ స్థానంలో ఆయన ఓటమి ఎరగలేదు. ఇక ఈ ఎన్నికల్లో మొదటిసారి పరాజయం చూశారు రఘుబర్. కాగా ఆయనతో పాటు ఆరుగురు మంత్రులు, స్పీకర్ కూడా ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఝార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తోసి జేఏంఎం- కాంగ్రెస్- ఆర్జేడీ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. మొత్తం 81 స్థానాల్లో 47సీట్లను గెలుచుకొని అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..