బ్రేకింగ్: మోస్ట్‌ వాంటెడ్‌ అల్‌-ఖైదా ఉగ్రవాది అరెస్టు!

Al Qaeda suspect arrested, బ్రేకింగ్: మోస్ట్‌ వాంటెడ్‌ అల్‌-ఖైదా ఉగ్రవాది అరెస్టు!

సంఘ విద్రోహ చర్చలకు పాల్పుడుతున్న అల్‌-ఖైదా ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌ (ఏక్యూఐఎస్‌) ఉగ్రవాదిని ఝార్ఖండ్‌ పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది కలీముద్దీన్‌ ముజాహిరీని అదుపులోకి తీసుకున్నట్లు ఏటీఎస్‌ అధికారులు తెలిపారు. ఆదివారం రాంచీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అధికారులు మరిన్ని వివరాలు వెల్లడించారు. ఈ ఉగ్రవాదిని పట్టుకొనేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏటీఎస్‌ బృందం జంషెడ్‌పూర్‌లోని టాటానగర్‌ రైల్వేస్టేషన్‌లో నిందితుడిని అరెస్టు చేసినట్లు వివరించారు. ఆజాద్‌ నగర్‌లోని తన ఇంటికి కలీముద్దీన్‌ రాబోతున్నాడనే సమాచారంతో నిఘా వేసినట్లు చెప్పారు.

”ఈ ఉగ్రవాది తరచూ తాను ఉండే ప్రదేశాలు మారుస్తుండటంతో అతణ్ని పట్టుకోవడం సవాలుగా మారింది. అందుకే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడి కదలికలు పసిగట్టాం. ఇతడి అరెస్టు ద్వారా ఝార్ఖండ్‌లో ఈ ఉగ్రవాద గ్రూప్‌ కదలికల గురించి ఆరా తీస్తున్నాం. యువతను ప్రేరేపించి వారిని ఏక్యూఐఎస్‌లో చేర్పించేందుకు కలీముద్దీన్‌ ప్రయత్నించేవాడు. అంతేకాక అతడికి అల్‌-ఖైదా ఉన్నత నాయకులతో సంబంధాలు కూడా ఉన్నాయి.” అని అదనపు డీజీపీ మురారీలాల్‌ మీనా వెల్లడించారు.

Al Qaeda suspect arrested, బ్రేకింగ్: మోస్ట్‌ వాంటెడ్‌ అల్‌-ఖైదా ఉగ్రవాది అరెస్టు!

కొడుకు హుజైఫాతో కలిసి కలీముద్దీన్‌ బంగ్లాదేశ్‌ లేదా నేపాల్‌కు పారిపోయి ఉంటారని పోలీసులు తొలుత భావించారు. 2016 ముందు వరకూ నిందితుడు జైలులో ఉండేవాడు. స్థానిక నాయకుల పూచీ కత్తుపై కలీముద్దీన్‌ విడుదల కాగా అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *