‘జెట్‌’ సంక్షోభంపై కేంద్రం అత్యవసర సమావేశం

ముంబయి: ప్రయివేటు రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌  పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. నగదు లభ్యత కొరవడటంతో… లీజు చెల్లించలేకపోవడంతో మరో 4 విమానాల కార్యకలాపాలు విమానయాన సంస్థ నిలిపివేసింది. దీంతో రాకపోకలు సాగించకుండా ఆగిపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాల సంఖ్య 41కి చేరింది. ఇదే కాకుండా  ఈ నేపథ్యంలో ‘జెట్‌’ పరిస్థితులపై కేంద్రం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితులపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేయాలంటూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తన […]

'జెట్‌' సంక్షోభంపై కేంద్రం అత్యవసర సమావేశం
Follow us

|

Updated on: Mar 19, 2019 | 5:21 PM

ముంబయి: ప్రయివేటు రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌  పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. నగదు లభ్యత కొరవడటంతో… లీజు చెల్లించలేకపోవడంతో మరో 4 విమానాల కార్యకలాపాలు విమానయాన సంస్థ నిలిపివేసింది. దీంతో రాకపోకలు సాగించకుండా ఆగిపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాల సంఖ్య 41కి చేరింది. ఇదే కాకుండా  ఈ నేపథ్యంలో ‘జెట్‌’ పరిస్థితులపై కేంద్రం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితులపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేయాలంటూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తన మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించారు. అంతేగాక.. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఎదుర్కొంటున్ సమస్యలపై డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్‌ సివిల్ ఏవియేషన్‌(డీజీసీఏ) నుంచి తక్షణమే నివేదిక తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ కనీసం తన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిని దిగజారింది. . గత కొద్ది నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో వారి మానసిక స్థైర్యం దెబ్బతిని సంస్థ విమాన సర్వీసులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. విమాన సర్వీసుల్లో కోత విధించే క్రమంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ దిశగా సంకేతాలు పంపుతోంది.  ఇదిలాగే కొనసాగితే విమానాల భద్రత ప్రమాదంలో పడుతుందని వారు అంటున్నారు.   అయితే విమానాల ఆకస్మిక రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చివరినిమిషంలో విమానాలు రద్దవుతుండటంతో అధిక ధర పెట్టి మరో విమానానికి టికెట్‌ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.