జెర్సీ మూవీ రివ్యూ..

నేచురల్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న నాని.. కొద్దికాలంలోనే స్టార్‌ హీరోగా ఎదిగాడు. నాని కెరీర్‌‌లో ఒకటి, రెండు సినిమాలు తప్ప మిగిలిన చిత్రాలన్నీ మంచి విజయం అందుకున్నవే. గతేడాది మల్టీస్టారర్‌తో ‘దేవదాస్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఇప్పుడు జెర్సీ సినిమాతో మనముందుకు వచ్చేశారు. 1980ల కాలం నాటి నేపథ్యం కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే… కథలోకి వెళ్లాల్సిందే. కథ : అర్జున్‌ (నాని) ఇండియన్‌ క్రికెట్‌ జట్టులో […]

జెర్సీ మూవీ రివ్యూ..
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2019 | 4:08 PM

నేచురల్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న నాని.. కొద్దికాలంలోనే స్టార్‌ హీరోగా ఎదిగాడు. నాని కెరీర్‌‌లో ఒకటి, రెండు సినిమాలు తప్ప మిగిలిన చిత్రాలన్నీ మంచి విజయం అందుకున్నవే. గతేడాది మల్టీస్టారర్‌తో ‘దేవదాస్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఇప్పుడు జెర్సీ సినిమాతో మనముందుకు వచ్చేశారు. 1980ల కాలం నాటి నేపథ్యం కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే… కథలోకి వెళ్లాల్సిందే.

కథ : అర్జున్‌ (నాని) ఇండియన్‌ క్రికెట్‌ జట్టులో ఆడాలని​ కలలు కంటూ ఉంటాడు. ఎన్ని సార్లు ప్రయత్నించినా చివరి క్షణాల్లో అవకాశం వచ్చి.. చేజారి పోతూ ఉంటుంది. అలా 26 ఏళ్ల వయసులో కెరీర్‌ను వదిలేస్తాడు. అప్పటికే తను ప్రేమించిన సారాను పెళ్లి చేసుకున్న అర్జున్‌.. ఓ ఉద్యోగంలో జాయిన్‌ అయి నార్మల్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తూ ఉంటాడు. అర్జున్‌, సారాలకు నాని అనే కుమారుడు పుడతాడు. కొంత కాలానికి అర్జున్‌ ఉద్యోగం కూడా పోతుంది. అలా.. క్రికెట్‌ను వదిలేసి, ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఉంటాడు. ఇంట్లో ఖాళీగా ఉంటాడు. క్రికెట్‌ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అర్జున్.. క్రికెట్‌ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అతని జీవితంలో జరిగిన నాటకీయ పరిణామాలేంటి..? అనేవి ఈ సినిమాలో హైలెట్ పాయింట్స్.

ఎవరెలా చేశారంటే..: నానిని ఇప్పటివరకూ హుషారైన పాత్రలలో చూశాం. తన కెరీర్‌లో తొలిసారి అందుకు భిన్నమైన పాత్ర పోషించాడు. ఒక విధంగా చెప్పాలంటే నాని వన్‌మెన్‌షో అని చెప్పవచ్చు. ఎమోషనల్‌ సీన్లలో తను ఎంత బాగా నటించగలడో ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఒక క్రికెటర్‌గా‌, ఒక ప్రేమికుడిగా ఎంత చక్కగా నటించాడో.. ఒక తండ్రిలా అంతే బాగా నటించాడు. ఒక కొడుకు కోసం సగటు తండ్రి పడే తపనను అద్భుతంగా చూపించాడు.

ఇక హీరోయిన్ పాత్రలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ కూడా చాలా బాగా నటించారు. కేవలం గ్లామర్‌ కోసమే ఆ పాత్రను ఎంచుకోకుండా.. సారాగా కథలోని కీలక సన్నివేశాల్లో మంచి హావభావాలు పలికించారు. ఇక అలాగే.. అర్జున్‌ తనయుడు నానిగా చేసిన బాలనటుడు కూడా చక్కగా నటించాడు. విరామ సన్నివేశాల్లో అతడి నటన అలరిస్తుంది.

ఇక.. అర్జున్ కోచ్‌గా నటించిన సత్యరాజ్ తన కెరీర్‌లో మరో మంచి పాత్ర చేశారు. నాని, సత్యరా‌జ‌్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానులను మరింతగా ఆకట్టుకున్నాయి.

జెర్సీ అనే సింపుల్ లైన్‌ తీసుకుని దాన్ని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మాయ చేశారనే చెప్పాలి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. 1986 నాటి కథను ప్రజెంట్ జనరేషన్‌కి కనెక్ట్ అయ్యేలా నడిపించిన తీరు అద్భుతం అనే చెప్పాలి. సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడు ఊహించని స్థాయిలో ఉంటుంది. బరువెక్కిన గుండెలతో థియేటర్ బయటకు వచ్చేలా చేశాడు దర్శకుడు. చివరి పది నిమిషాలు గుండెల్ని పిండేసే సన్నివేశాలతో అద్భుతంగా ఆవిష్కరించారనే చెప్పాలి.

అలాగే.. ఈ సినిమాకి అనిరుథ్ రవిచందర్ చక్కటి సంగీతాన్ని అందించారు. సినిమాలో పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరింత రక్తి కట్టించాయి.

చివరకు.. జెర్సీ ఓ మంచి తండ్రి కథ అనే చెప్పాలి. అలాగే.. ఎన్ని ఇబ్బందులున్నా.. తన కలను నెరవేర్చుకోవడంలో హీరో బాగా కష్టపడ్డాడు. ఈ కథ వందలో గెలిచిన ఒక్కడి గురించి కాదు.. ప్రయత్నిస్తూ ఆగిపోయిన 99 మంది గురించి.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.