2024 నాటికి చంద్రునిపైకి..

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేటి ప్రపంచంలో కొత్తకొత్త ఇన్నోవేషన్స్ తెరపై ఆవిష్కృతమవుతున్నాయి. తాజాగా ఏరోస్పేస్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు అమెజాన్‌ సంస్థ అధినేత జెఫ్‌ బెజోస్‌. రాబోయేరోజుల్లో ఈ సెక్టార్‌కున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని చంద్రుడిపైకి సామాన్యుడి పంపేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా అంతరిక్ష వాహక నౌక నమూనాను ఆవిష్కరించారు. దీనికి ‘బ్లూ మూన్’ అని నామకరణం చేశారు. చూడటానికి టైమ్‌ మెషిన్‌లా కనిపిస్తోంది. నాలుగు స్టాండ్స్ మధ్యలో ఓ ట్యాంక్‌. ఈ వాహనం నౌక ద్వారా 2024లోగా చంద్రుడిపైకి మనుషులతోపాటు ఉపగ్రహాలను, యంత్రాలను పంపించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. వాషింగ్టన్‌లో జరిగిన ఈవెంట్‌లో దీని గురించి ఆయన వివరించారు. భూమి మీద ఇంధనం నింపినప్పుడు బ్లూ మూన్ వాహనం బరువు దాదాపు 15 టన్నులు కాగా, చంద్రుని మీద ల్యాండయ్యేసరికి సుమారు 3.2 టన్నులకు తగ్గుతుంది. భవిష్యత్తులో చంద్రమండలంపై మనుషులు నివాసం ఉంటారని భావించి అందుకు అనుగుణంగా ప్రయాణాన్ని సులభతరం చేసే లక్ష్యంతో చేపట్టారు ఈ ప్రాజెక్టు. ఈ వాహనంలో ఉపయోగించనున్న బీఈ-7 అనే రాకెట్ ఇంజిన్‌ను గురించి వివరించారు. 2016 నుంచి దీన్ని అభివృద్ధి చేస్తున్నామని, 2024లోగా అందుబాటులోకి తెస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *