Breaking News
  • ఈఎస్‌ఐ స్కామ్‌పై స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరాం. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుంది. గత ప్రభుత్వంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగింది-జయరాం. అవినీతిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాం. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం-జయరాం. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్ము రికవరీ చేస్తాం. అవినీతికి పాల్పడిన వారినెవ్వరినీ వదిలిపెట్టం-మంత్రి జయరాం
  • వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను వక్రీకరించారు-ఇంతియాజ్‌ జలీల్‌. అలాంటి వ్యాఖ్యలను పార్టీ సమర్ధించదు. వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. -టీవీ9తో మహారాష్ట్ర ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌.
  • తూ.గో: అన్నవరం ఆలయానికి కొత్త పాలక మండలి నియామకం. 16 మందితో కొత్త పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో వివాదాస్పదమైన అప్పటి మంత్రి పితాని వ్యవహారం. మందుల సరఫరా బిల్లుల చెల్లింపులో మొదట సరఫరా చేసిన వాళ్లకే.. బిల్లులు చెల్లించాలని ఆదేశించిన అప్పటి కార్మికశాఖ కార్యదర్శి. కార్మికశాఖ కార్యదర్శి ఆదేశాలను అడ్డుకున్న పితాని సత్యానారాయణ. తమకు నచ్చిన వాళ్లకే ఇచ్చేలా వ్యవహరించారని పితానిపై ఆరోపణలు.
  • ప్రకాశం: ఒంగోలులో ఏఎన్‌ఎం హైమావతి ఆత్మహత్యాయత్నం. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన హైమావతి. హైమావతి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. విధుల నుంచి తొలగించడంతో ఆత్మహత్యకు యత్నించిందన్న స్థానికులు. తనను పర్మినెంట్‌ చేస్తామంటూ అపోలో ఏజెన్సీకి చెందిన.. ప్రదీప్‌, గణేష్‌లు రూ.3 లక్షలు తీసుకున్నారని హైమావతి ఆరోపణలు.

‘మా’లో గొడవ ఎందుకంటే..? క్లారిటీ ఇచ్చిన జీవిత..!

Jeevitha Rajasekhar gives clarity on MAA Association controversy, ‘మా’లో గొడవ ఎందుకంటే..? క్లారిటీ ఇచ్చిన జీవిత..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో మరో వివాదం చోటు చేసుకుంది. అధ్యక్షుడు నరేష్‌కు, వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్‌కు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. జనరల్ బాడీ మీటింగ్ ఉందని జీవితా, రాజశేఖర్‌లు ‘మా’ సభ్యులకు మెసేజ్‌లు పంపారు. నరేష్ మినహా మిగిలినవారంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే అధ్యక్షుడు లేకుండా మీటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ నరేష్ తరపు న్యాయవాది జీవితా రాజశేఖర్‌ను ప్రశ్నించారు. ఇది ఫ్రెండ్లీ మీటింగ్ మాత్రమేనని.. కోర్టు ఆర్డర్ ప్రకారం ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని వారు అన్నారు.

కాగా.. ఇదిలా ఉండగా.. దీనిపై జీవితా రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు. నిన్న ఉదయం 9 గంటలకు మొదలైన మీటింగ్‌.. సాయంత్రం 5 గంటలకు వరకూ.. నిర్విరామంగా.. ప్రశాంతంగా.. జరిగిందని తెలిపారు. కానీ.. మీడియాలో మాత్రం.. ఏవోవో గొడవలు జరిగాయని చెప్పారు. ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లో నాకు చాలా మెసేజ్‌లు, కాల్స్ వచ్చాయి. అందరికీ.. మీటింగ్‌లో ఏం జరిగిందో తెలపడానికి నేను ఇలా మీ ముందుకు వచ్చినట్టు ఆమె అన్నారు.

అయితే.. మీటింగ్‌లో కొన్ని కొన్ని మనస్పర్థలు, ఆర్గ్యూమెంట్స్ జరిగాయి కానీ.. అవి కూడా సామరస్యంగా పూర్తి అయ్యాయిని చెప్పారు. మా సభ్యులకు కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఉండటం వల్లే.. ఈ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. అది ఒక నార్మల్ జనరల్ బాడీ మీటింగ్ మాత్రమే తప్పించి.. దీనికి కోర్టు పర్మిషన్లు ఏం అవసరం లేదని చెప్పుకొచ్చారు. అంతేగాక.. మాలో ఇప్పటివరకూ.. 1000 మంది సభ్యులు ఉన్నారని.. అందులో ఓ 20 పర్సెంట్ సభ్యుల ఆమోదం ఉంటే.. మీటింగ్ పెట్టుకోవచ్చని.. దీనికి కోర్టు పర్మిషన్ అవసరం లేదన్నారు. అలాగే.. మీటింగ్‌కు అటెండ్ కాని సభ్యులు కూడా.. మాతో ఫోన్‌లో టచ్‌ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే.. మాకు, అధ్యక్షుడు నరేష్‌కి మధ్య ఎటువంటి గొడవలు జరగలేదని తెలిపారు.

Jeevitha Rajasekhar gives clarity on MAA Association controversy, ‘మా’లో గొడవ ఎందుకంటే..? క్లారిటీ ఇచ్చిన జీవిత..!

Related Tags