జగన్ మా వాడే- జేసీ

ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే సీనియర్ రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డి… ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మా వాడే అని వ్యాఖ్యానించిన జేసీ దివాకర్ రెడ్డి… ఆయనను తాను ఎఫ్పుడూ ద్వేషించలేదని అన్నారు. వైసీపీ అధినేతపై తాను కేవలం రాజకీయపరమైన విమర్శలు మాత్రమే చేశానని అన్నారు. జగన్ తన కుమారుడు స్నేహితుడని… అందుకే చంద్రబాబు ముందు కూడా తాను జగన్‌ను మావాడు అని సంభోదించేవాడినని గుర్తు […]

జగన్ మా వాడే- జేసీ
Follow us

|

Updated on: Jun 03, 2019 | 5:20 PM

ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే సీనియర్ రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డి… ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మా వాడే అని వ్యాఖ్యానించిన జేసీ దివాకర్ రెడ్డి… ఆయనను తాను ఎఫ్పుడూ ద్వేషించలేదని అన్నారు. వైసీపీ అధినేతపై తాను కేవలం రాజకీయపరమైన విమర్శలు మాత్రమే చేశానని అన్నారు. జగన్ తన కుమారుడు స్నేహితుడని… అందుకే చంద్రబాబు ముందు కూడా తాను జగన్‌ను మావాడు అని సంభోదించేవాడినని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు శుభపరిణామం అని జేసీ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రాక్టీకల్‌గా ఆలోచిస్తున్నారని… ఇదే రకంగా ముందుకు సాగితే ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నుంచి తనకు పిలుపు వచ్చిందనే విషయంపై జేసీ దివాకర్ రెడ్డి స్పందించలేదు. దీనిపై ఆయన సమాధానం దాటవేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని అన్నారు. అనంతపురం పట్టణం అభివృద్ధికి నిధుల కొరత లేదని… పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై ఉందని అన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఏ రకంగా తగ్గించాలనే దానిపై విద్యావేత్తలు, మేధావులతో చర్చిస్తున్నామని… ఈ ప్రక్రియ కొనసాగుతుందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.