దుబ్బాక దెబ్బతో మా ఓటింగ్ శాతం పెరిగింది.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా..

దుబ్బాక దెబ్బతో తెలంగాణలో మా ఓటింగ్ శాతం పెరిగిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన నడ్డా మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

దుబ్బాక దెబ్బతో మా ఓటింగ్ శాతం పెరిగింది.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా..
Follow us

|

Updated on: Nov 28, 2020 | 7:49 AM

దుబ్బాక దెబ్బతో తెలంగాణలో మా ఓటింగ్ శాతం పెరిగిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన నడ్డా మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ అభివ‌ృద్ధిని చూసి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి మేయర్ పీటం కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

2019 ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకున్నామని, ఇప్పుడు దుబ్బాక దెబ్బతో తెలంగాణలో బీజేపీ మరింత మెరుగైందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బీజేపీకి మద్ధతు తెలిపిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దీనికి ముందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జేపీ నడ్డా అన్నిడివిజన్ల‌లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. కొత్తపేట నుంచి నాగోల్ వరకు రోడ్‌ షోలో పాల్గొన్నారు. కేవలం మునిసిపల్ ఎన్నికల కోసం బీజేపీ జాతీయ నాయకులు ప్రచారం చేస్తున్నారని కొన్ని పార్టీలు బహిరంగంగా విమర్శించినా.. కమలాన్ని వికసింపజేసేందుకు మేము ఎక్కడికైనా వస్తామని ప్రకటించారు. అశేషంగా వచ్చిన ప్రజలను చూస్తుంటే తెలంగాణలో రాబోయే కాలంలో బీజేపీ జెండా పాతడం కాయమన్నారు. కాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ఈ రోజు హైదరాబాద్ ఎన్నికల ప్రచారం కోసం రానున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా భారత్ బయోటెక్‌ను సందర్శిస్తారు. ఇక రేపు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.