ఆకట్టుకుంటోన్న కాజల్ ‘కోమలి’ ట్రైలర్!

జయం రవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రదీప్ రంగనాధన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘కోమలి’. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేసింది చిత్ర యూనిట్. దాదాపు 2.15 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. పదహారేళ్ళ క్రితం కోమాలోకి వెళ్లిన హీరో.. అధునాతన కాలంలో కళ్ళు తెరుస్తాడు. ఆ లైఫ్‌ను హీరో ఎలా జీవించాడు.. ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటనేది చిత్ర కథాంశం. ట్రైలర్ అంతటా ఉన్న కామెడీ సీన్స్ […]

ఆకట్టుకుంటోన్న కాజల్ 'కోమలి' ట్రైలర్!
Follow us

|

Updated on: Aug 04, 2019 | 2:07 AM

జయం రవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రదీప్ రంగనాధన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘కోమలి’. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేసింది చిత్ర యూనిట్. దాదాపు 2.15 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆధ్యంతం ఆకట్టుకుంటోంది.

పదహారేళ్ళ క్రితం కోమాలోకి వెళ్లిన హీరో.. అధునాతన కాలంలో కళ్ళు తెరుస్తాడు. ఆ లైఫ్‌ను హీరో ఎలా జీవించాడు.. ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటనేది చిత్ర కథాంశం. ట్రైలర్ అంతటా ఉన్న కామెడీ సీన్స్ అభిమానులను అద్భుతంగా అలరిస్తున్నాయి.

హిప్ హాప్ బ్యా‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆడియన్స్‌కు ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఖాయమని అనిపిస్తోంది. ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. లేట్ ఎందుకు మీరు కూడా ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.