ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన… అద్భుతమైన శివాలయం!

ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన శివుడి దేవాలయం . ఈ ప్రసిద్ద పుణ్యక్షేత్రం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, సోలాన్ జిల్లాలోని జతోలి టౌన్ లో వెలసియున్నది. సుమారు 40సంవత్సరాల కృషి ఫలితమే ఈ అద్భుతమైప దేవాలయం. హిమాచల్ ప్రదేశ్ లోని పర్యాటక ప్రదేశాల్లో ఇది అత్యంత ఆకర్షణ కలిగిన ఒక పెద్ద అద్భుతమైన శివుడి దేవాలయం. కొండపై నుండి చూస్తే ఈ జటోలి దేవాలయం అత్యంత ఆకర్షణీయంగా కనబడుతుంది. ఈ ఆలయంలో హిందువుల పవిత్ర దేవుడైన ఆ […]

ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన... అద్భుతమైన శివాలయం!
Follow us

| Edited By:

Updated on: Oct 23, 2019 | 4:35 PM

ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన శివుడి దేవాలయం . ఈ ప్రసిద్ద పుణ్యక్షేత్రం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, సోలాన్ జిల్లాలోని జతోలి టౌన్ లో వెలసియున్నది. సుమారు 40సంవత్సరాల కృషి ఫలితమే ఈ అద్భుతమైప దేవాలయం. హిమాచల్ ప్రదేశ్ లోని పర్యాటక ప్రదేశాల్లో ఇది అత్యంత ఆకర్షణ కలిగిన ఒక పెద్ద అద్భుతమైన శివుడి దేవాలయం. కొండపై నుండి చూస్తే ఈ జటోలి దేవాలయం అత్యంత ఆకర్షణీయంగా కనబడుతుంది. ఈ ఆలయంలో హిందువుల పవిత్ర దేవుడైన ఆ పరమేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. ఈ ఆలయం అత్యంత మహిమగల శక్తివంతమైన ఆలయం మరియు అద్భుతాలకు కూడా ప్రసిద్ది చెందింది. మరి ఆలస్యం చేయకుండా ఈ ప్రసిద్ద దేవాలయం గురించి తెలుసుకుందాం..

జటోలి

శివుడికి ఉన్న సుదీర్ఘ జటా(జుట్టు)నుండి జటోలి పేరు వచ్చింది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద శివాలయంగా పరిగణింపబడుతున్న ఈ ఆలయం ఒక అద్భుత నిర్మాణం. జతోలి శివ దేవాలయం సోలన్ జిల్లాలోని స్థానికుకులకు మాత్రమే కాదు ఇతర పర్యాటకులకు కూడా ఒక ప్రసిద్ద ప్రార్థనా ప్రదేశంగా ఉన్నది. ఇది స్థానికులతో పాటు అనేక మంది భక్తులను ఆకర్షిస్తున్నది. సోలన్ నగరం నుండి ఇది సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కథనాల ప్రకారం

అనేక కల్పిత కథలు మరియు కథనాల ప్రకారం జటోలి శివాలయం చరిత్రతో అనుబంధం కలిగి ఉంది. శివునికి చెందిన దేవాలయాలలో ఇది అత్యంత పురాతనమైనది. ఈ ఆలయంలో శివ భగవానుడిని విగ్రహం ప్రతిష్టింపబడటం విశేషం.

బాబా పరమహంస మార్గదర్శకత్వంతో

జటోలి శివాలయ నిర్మాణం పురాణాల ప్రకారం శివుడు ఇక్కడకు వచ్చి కొంతకాలం ఇక్కడే ఉన్నాడని తెలుపుతున్నది, తరువాత ఒక సాధువు బాబా స్వామి కృష్ణానంద్ పరమహంస ఇక్కడకు వచ్చి తపస్సు చేశాడనీ ప్రతీతి. బాబా పరమహంస మార్గదర్శకత్వంతో జటోలి శివాలయ నిర్మాణం ప్రారంభమైనట్లు చెబుతారు. ఆలయ గోపురం దాదాపు 111 అడుగుల ఎత్తులో ఉంది.

ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే సుమారు 100 మెట్లు ఎక్కాలి

ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే సుమారు 100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ ఆలయాన్ని అత్యంద్భుతంగా ఒక విలక్షణమైన దక్షిణ-ద్రవిడ శైలిలో నిర్మించబడినది. మరియు మూడు వరుస పిరమిడ్లతో నిర్మించిన ఈ కట్టడం చూస్తే నయనాందకరం కలుగుతుంది. మొదటి పిరమిడ్లో , రెండవ పిరమిడ్ లో శేష్ గాన్ యొక్క శిల్పం ఉంది. వినాయకుడి విగ్రం కూడా చూడవచ్చు.

ఆసియా ఖండంలోనే అతి పెద్ద దేవాలయంగా ఉన్న ఈ జతోలి శివ దేవాలయ నిర్మాణం పూర్తి చేయడానికి దాదాపు 40సంవత్సరాలు పట్టింది. ఆలయం లోపల ప్రాంగణంలో వివిధ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశారు. అలాగే ఆలయం లోపల స్పటిక మణి శివలింగను స్థాపించడంతో పాటు శివ, పార్వతి విగ్రహాలు కూడా స్థాపించబడ్డాయి. అలాగే ఆలయం ఎగువ బాగంలో 11 అడుగుల ఎత్తైన బంగారు మంటపంను ఏర్పాటు చేశారు.

‘జల్ కుండ్’

ఈ దేవాలయం యొక్క ఈశాన్య భాగంలో ‘జల్ కుండ్’ అని పిలిచే వాటర్ ట్యాంక్ ఉంది, ఇది పవిత్రమైన గంగా నదిగా భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ ట్యాంక్ లోని నీరు అనేక చర్మ రుగ్మతలను పోగొట్టడానికి చికిత్స చేసే కొన్ని ఔషద లక్షణాలను కలిగి ఉండటం విశేషం.

త్రిశూలంతో ఉరుములతో కూడా వర్షపు నీటిని భూమికి రప్పించడానికి ప్రసిద్ది. అంతే కాదు ఆనాటి కాలంలో ఇక్కడ ప్రజలు నీటి సమస్యతో జీవిస్తుండేవారు. అదే సమయంలో స్వామి కృష్ణానంద్ పరమన్స్ జీ శివుడిని ప్రార్థించి శివుడి యొక్క ఆయుధం త్రిశూలంతో ఉరుములతో కూడా వర్షపు నీటిని భూమికి రప్పించడానికి ప్రసిద్ది. అప్పటి నుండి ఈ ప్రదేశంలో నీటి కొరతనేది లేదు.

గుహలో శివుడు తపస్పు చేశాడని స్వామి కృష్ణనంద పరమహాన్స్ జీ నివసించిన ఈ ఆలయంలో ఒక గుహ ఉంది. ఈ గుహలో శివుడు తపస్పు చేశాడని పురాణలు తెలుపుతున్నాయి. ఈ గుహకు 300 మీటర్ల దూరంలో శివలింగం ఉంది. శివలింగంకు ఎదురుగా నంది విగ్రహం కొలువై ఉంది.

మహాశివరాత్రి ఉత్సవాలు

ఈ పురాతన ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగలో జరిగే వార్షిక ఉత్సవానికి ప్రసిద్ది చెందినది. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి స్థానికులు మాత్రమే కాదు, చుట్టు ప్రక్కల ప్రదేశాల నుండి కూడా అనేక మంది భక్తులు సందర్శనార్థం తరలి వస్తుంటారు. ఈ సందర్భంగా ఉపవాస జాగరణలతో ఈ దేవాలయం శివనామాలతో మారుమ్రోగిపోతుంది.కాబట్టి ఈ దేవాలయన్నా సందర్శించడానికి శివరాత్రి నెల ఉత్తమ సమయంగా భావిస్తారు.

ఆలయ సమయం

సాధారణంగా, ఈ ఆలయం ఉదయం 5 నుండి రాత్రి 8 వరకు తెరుచుకుంటుంది ఉదయం సమయం: 5 AM – 1 PM సాయంత్రం సమయం: 3 PM – 8 PM

ఎలా వెళ్లాలి?

విమానం ద్వారా ఆలయాన్ని చేరుకోవడానికి సిమ్లా మరియు చండీగఢ్ విమానశ్రయం సోలన్ కు సమీపంలో ఉన్నాయి. విమానశ్రయం నుండి 30-40కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి ప్రభుత్వ లేదా ప్రైవేట్ బస్సుల రవాణా సౌకర్యం ఉంది.  ఈ దేవాలయం ఉన్న గ్రామానికి బస్సు సౌకర్యం లేనందున, బస్సు లేదా రైలు మార్గంలో ప్రయాణించి సోలన్ చేరుకుని అక్కడి నుండి టాక్సీ లేదా ప్రైవేట్ వాహణాల్లో ప్రయాణించి ఆలయాన్ని చేరుకోచ్చు.