Breaking News
  • భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కరోనాపై పోరులో భారత్‌ చేయాల్సిందంతా చేస్తోంది. సాయం చేయడానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటాం-ప్రధాని మోదీ.
  • ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసలు. కరోనాపై యుద్ధంలో భారతీయుల కృషి అభినందనీయం. భారత ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు-ట్రంప్‌ ట్వీట్‌.
  • కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో గుండెపోటుతో వ్యక్తి మృతి. ఇటీవల కరోనాతో చనిపోయిన వ్యక్తికి సోదరుడు కావడంతో.. స్థానికుల్లో పలు అనుమానాలు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలింపు. శాంపిల్స్‌ పరీక్షించే వరకు మృతదేహం ఇవ్వమంటున్న అధికారులు.
  • తెలంగాణలో డయల్‌ 100కు పెరుగుతున్న కాల్స్‌. లాక్‌డౌన్‌ తర్వాత డయల్‌ 100కు 13,34,330 కాల్స్‌. ఎమర్జెన్సీ కాల్స్‌-82,014. కోవిడ్‌ సస్పెక్ట్ కాల్స్‌- 2,710. లాక్‌డౌన్‌ కాల్స్‌-21,758. ఇన్‌ ఎఫెక్టివ్‌ కాల్స్‌-87,665. విచారణ కోసం చేసిన కాల్స్‌- 84,123. తగ్గిన చోరీలు, గృహ హింస, రోడ్డుప్రమాదాల కాల్స్‌.
  • తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ తగ్గింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్రైమ్‌రేట్‌ భారీగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో క్రైమ్‌రేటు 56 శాతానికి పడిపోవడం ఊరటనిస్తోంది. లాక్‌డౌన్‌తో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి.

ఉత్తమ భారత అంతర్జాతీయ క్రికెటర్‌గా.. జస్‌ప్రీత్ బుమ్రా!

Jasprit Bumrah receives awards for best Indian international cricketer, ఉత్తమ భారత అంతర్జాతీయ క్రికెటర్‌గా.. జస్‌ప్రీత్ బుమ్రా!

టీమిండియా డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ జస్ప్రీత్‌ బుమ్రాను బీసీసీఐ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. ఆదివారం రాత్రి ముంబయిలో నిర్వహించిన 2018-2019 వార్షికోత్సవంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమంగా రాణించినందుకు బుమ్రాకు పాలీ ఉమ్రిగర్‌ అవార్డును బహుకరించింది. ఇక మహిళల విభాగంలో లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. బుమ్రా 2018 జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసి ఐదు వికెట్లు తీశాడు. అనంతరం ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ పర్యటనల్లో ఇదే ప్రదర్శన చేసి ఆసియా తరపున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు.

ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌, మహిళా క్రికెటర్‌ అన్జుమ్‌ చోప్రాలను సీకే నాయుడు జీవితకాల పురస్కారంతో సత్కరించారు. శ్రీకాంత్‌ 1983 ప్రపంచకప్‌ ఫైనల్లో బౌలింగ్‌ చేసి దిగ్గజ విండీస్‌ ఆటగాళ్లను ఎక్కువ పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. అలాగే అతను రిటైర్మెంట్‌ తర్వాత బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌గా సేవలందించాడు. అతడి పదవీకాలంలోనే టీమిండియా 2011లో రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను సాధించింది. అలాగే మహిళా క్రికెట్‌లో అన్జుమ్‌ భారత్‌ తరపున వంద వన్డేలాడిన తొలి క్రికెటర్‌గా నిలవడంతో పాటు 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో నాలుగు వన్డే ప్రపంచకప్‌లు, రెండు టీ20 ప్రపంచకప్‌లు ఆడింది.

Jasprit Bumrah receives awards for best Indian international cricketer, ఉత్తమ భారత అంతర్జాతీయ క్రికెటర్‌గా.. జస్‌ప్రీత్ బుమ్రా!

13/01/2020,1:00AM

Related Tags