#HBDMegastarChiranjeevi: చిరు బర్త్‌డేకి ‘వాల్మీకి’ గిఫ్ట్!

చిరంజీవి పుట్టిన రోజున మెగా అభిమానులకు యంగ్ హీరో వరుణ్ తేజ్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు. వరుణ్ నటిస్తున్న ‘వాల్మీకి’ చిత్రానికి సంబంధించిన ‘జర్రా.. జర్రా’.. లిరికల్ వీడియోను ఆగస్టు 21న విడుదల చేయగా, వీడియో సాంగ్ ప్రోమోను ఆగస్టు 22న రిలీజ్ చేశారు. ఇప్పటికే గుబురు గడ్డం, మాస్ లుక్‌లో ఆకట్టుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమా టీజర్‌తో హైప్ క్రియేట్ చేసారు. తాజాగా విడుదలైన లిరిక్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:00 pm, Thu, 22 August 19
Jarra jarra video promo from Valmiki

చిరంజీవి పుట్టిన రోజున మెగా అభిమానులకు యంగ్ హీరో వరుణ్ తేజ్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు. వరుణ్ నటిస్తున్న ‘వాల్మీకి’ చిత్రానికి సంబంధించిన ‘జర్రా.. జర్రా’.. లిరికల్ వీడియోను ఆగస్టు 21న విడుదల చేయగా, వీడియో సాంగ్ ప్రోమోను ఆగస్టు 22న రిలీజ్ చేశారు.

ఇప్పటికే గుబురు గడ్డం, మాస్ లుక్‌లో ఆకట్టుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమా టీజర్‌తో హైప్ క్రియేట్ చేసారు. తాజాగా విడుదలైన లిరిక్ సాంగ్..‌ ‘వాల్మీకి’ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. సెప్టెంబర్ 13న మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు హరీశ్ శంకర్. వరుణ్ తేజ్ నెగిటివ్ రోల్‌లో నటించడం విశేషం. హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు మృణాళిని రవి తదితరులు నటిస్తున్నారు. మిక్కి. జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రిమేక్‌గా  ‘వాల్మీకి’ రూపొందుతోంది.