Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

జపనీస్ టెక్నాలజీతో పొల్యూషన్‌కి చెక్: సుప్రీంకోర్టు సలహా!

Japanese Technology To Fight Pollution? SC Asks Centre To Explore, జపనీస్ టెక్నాలజీతో పొల్యూషన్‌కి చెక్: సుప్రీంకోర్టు సలహా!

ఢిల్లీ.. సమీప ప్రాంతాలలో గాలి నాణ్యత మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో, రాజధానితో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో వాయు కాలుష్యం సమస్యపై సుప్రీంకోర్టు ఈ రోజు కేంద్రాన్ని నిందించింది. వాయు కాలుష్యాన్ని పారద్రోలే పరిష్కారాలను కనుగొనడానికి హైడ్రోజన్ ఆధారిత ఇంధన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని అన్వేషించాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమస్యను పరిష్కరించడానికి జపాన్ నుండి సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై నివేదికను డిసెంబర్ 3 లోగా సమర్పించనుంది.

“మా దృష్టిలో, ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రభుత్వం సరియైన ప్రయత్నాలు చేయలేదు” అని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. “ఉత్తర భారతదేశం మొత్తం, ఎన్‌సిఆర్ వాయు కాలుష్య సమస్యతో బాధపడుతోంది” అని కోర్టు పేర్కొంది.

ఢిల్లీ.. ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని జపాన్ లోని ఒక విశ్వవిద్యాలయం పరిశోధన నిర్వహించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఈ పరిశోధన చాలా వినూత్నమైనదని, ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న కాలుష్య స్థాయిలను ఎదుర్కోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. జపాన్ లోని ఒక విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు విశ్వనాథ్ జోషిని బెంచ్‌కు పరిచయం చేశారు, వాయు కాలుష్యాన్ని నిర్మూలించే అవకాశం ఉన్న హైడ్రోజన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం గురించి ఆయన వివరించారు.

మంగళవారం ఢిల్లీ.. దాని శివారు ప్రాంతాలు పొగమంచుతో కమ్ముకున్నాయి. నగరంలో మొత్తం గాలి నాణ్యత సూచిక (AQI) బుధవారం ఉదయం 494 గా ఉందని పర్యవేక్షణ సంస్థ సఫర్(SAFAR) తెలిపింది. శీతాకాలం ప్రారంభమవుతుండటంతో ఢిల్లీ పరిసరాలు కొన్ని వారాలపాటు పొగమంచుతో కప్పబడి ఉంటాయి అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమితా రాయ్ చౌదరి పేర్కొన్నారు.