ఆ ఒప్పందం నుంచి ఇండియా ఔట్.. జపాన్ కూడా..

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సభ్య దేశాల మధ్య స్వేఛ్చా వాణిజ్యానికి సంబంధించిన ‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం ‘ (ఆర్సీఈపీ) పై తాను సంతకాలు చేయబోనని జపాన్ ప్రకటించింది . ఈ విషయంలో తాము పూర్తిగా ఇండియా వైపే ఉంటామని.పేర్కొంటూ … . భారత్ కు సంఘీభావంగా నిలిచింది. ఈ తాజా పరిణామం ఒక విధంగా ఇండియాకు పెద్ద ‘ విజయమనే ‘ చెప్పాలి. ఇండియా భాగస్వామ్యం లేనిదే తాను కూడా పార్టనర్ కాలేమని ఈ […]

ఆ ఒప్పందం నుంచి ఇండియా ఔట్.. జపాన్ కూడా..
Follow us

|

Updated on: Nov 30, 2019 | 12:53 PM

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సభ్య దేశాల మధ్య స్వేఛ్చా వాణిజ్యానికి సంబంధించిన ‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం ‘ (ఆర్సీఈపీ) పై తాను సంతకాలు చేయబోనని జపాన్ ప్రకటించింది . ఈ విషయంలో తాము పూర్తిగా ఇండియా వైపే ఉంటామని.పేర్కొంటూ … . భారత్ కు సంఘీభావంగా నిలిచింది. ఈ తాజా పరిణామం ఒక విధంగా ఇండియాకు పెద్ద ‘ విజయమనే ‘ చెప్పాలి. ఇండియా భాగస్వామ్యం లేనిదే తాను కూడా పార్టనర్ కాలేమని ఈ దేశం స్పష్టం చేసింది . ఢిల్లీలో భారత, జపాన్ రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య శనివారం జరుగుతున్నఉన్నతస్థాయి సమావేశం నేపథ్యంలో ముఖ్యంగా ఇండియాకు ఈ దేశం సంఘీభావం ప్రకటించడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. జపాన్ ప్రధాని షింజో అబే త్వరలో ఇండియాను విజిట్ చేస్తున్నారు కూడా.. తమ దేశ ప్రయోజనాలకు ఈ డీల్ (ఒప్పందం) ఎంత మాత్రం దోహదపడబోదని భారత ప్రధాని మోదీ ఇటీవల స్పష్టం చేశారు. దీంతో ఈ డీల్ నుంచి మన దేశం వైదొలగింది. ఇందులో భాగస్వాములుగా ఉన్న సుమారు 16 దేశాలు దీనిపై ముందుకు సాగాలని నిర్ణయించాయని చైనా పేర్కొంది . అటు-తాము తిరిగి ఢిల్లీలో భేటీ అవుదామని మోదీ, షింజే అబే గత ఏడాది అక్టోబరులో జపాన్ లో జరిగిన 13 వ భారత-జపాన్ వార్షిక సమ్మిట్ లో నిర్ణయించారు. ఆ మేరకు మొదట ఇప్పుడు ఢిల్లీలో ఉభయ దేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు సమావేశమవుతున్నారు.

అసలు ఈ ఒప్పంద మతలబు ఏమిటి ? ప్రధానంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అన్ని సరుకులకు సంబంధించి స్వేఛ్చావాణిజ్యం జరగాలని ఉద్దేశిస్తూ 2011 నవంబరులో 19 వ ఏషియన్ మీట్ లో దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. అయితే ఈ ఏడాదే దీనినుంచి వైదొలగాలని ఇండియా, జపాన్ నిర్ణయించుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగస్వాములుగా బ్రూనే, కాంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, చైనా, జపాన్, ఇండియా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలున్నాయి. అయితే ఇక ఈ ఒప్పందంలో తాను భాగస్వామి కాదలచుకోలేదని ఇండియా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జపాన్ కూడా తీర్మానించింది. ఇది భారత విదేశాంగ విధానానికి ‘ బూస్ట్ ‘ అని చెప్పవచ్చు.