రూ.70లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించిన జపాన్ సర్కార్..!

కొవిడ్ రక్కసి నుంచి దేశ ప్రజలను కాపాడుకునేందుకు చిన్న దేశమైన పెద్ద మనసు చాటుకుంది. కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా విధించిన నిబంధనలను జపాన్‌ ప్రభుత్వం ఎత్తివేసింది. దేశంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తాజాగా మరో భారీ ప్యాకేజీ ప్రకటించింది. 1.1 ట్రిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.70లక్షల కోట్లు) ఉద్దీపన ప్యాకేజీకి జపాన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం ఇది రెండోసారి. వీటిలో కొంత […]

రూ.70లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించిన జపాన్ సర్కార్..!
Follow us

|

Updated on: May 27, 2020 | 6:52 PM

కొవిడ్ రక్కసి నుంచి దేశ ప్రజలను కాపాడుకునేందుకు చిన్న దేశమైన పెద్ద మనసు చాటుకుంది. కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా విధించిన నిబంధనలను జపాన్‌ ప్రభుత్వం ఎత్తివేసింది. దేశంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తాజాగా మరో భారీ ప్యాకేజీ ప్రకటించింది. 1.1 ట్రిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.70లక్షల కోట్లు) ఉద్దీపన ప్యాకేజీకి జపాన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం ఇది రెండోసారి. వీటిలో కొంత మొత్తాన్ని నేరుగా ఖర్చుచేస్తామని జపాన్ ఆర్థిక శాఖ వెల్లడించింది. మరోసారి కరోనా మహమ్మారి విజృంభించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే అక్కడి అధికారులను ఆదేశించారు. దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలోనే గతనెలలో మొదటి దఫా దాదాపు లక్ష ట్రిలియన్‌ డాలర్లను జపాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు కలిపి 2.18 ట్రిలియన్‌ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ.150లక్షల కోట్లు కేటాయించినట్లు అయ్యింది. ఇది జపాన్‌ దేశ జీడీపీలో దాదాపు 40శాతమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రపంచంలో అత్యధికంగా ఖర్చు పెట్టిన దేశాల్లో అమెరికా సరసన జపాన్‌ చేరింది. అమెరికా దాదాపు 2.3 ట్రిలియన్‌ డాలర్లను కేటాయించింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్‌ కరోనా వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేయగలిగింది. కేవలం ఇప్పటి వరకు దేశంలో 17వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 825 మరణాలు మాత్రమే సంభవించాయి.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.